Asianet News TeluguAsianet News Telugu

ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ కల సాకారం చేశాం: జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ

భారతదేశం కోసం త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులకు అందరికీ వందనాలు తెలిపారు. అనంతరం ఇటీవల సంభవించిన వరదల్లో మృతిచెందిన వారికి మోదీ నివాళులర్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇదే తన ప్రసంగమని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం తరపున తాను ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చినట్లు తెలిపారు. 

PM Narendra Modi in his address to the nation on 73rd independence day
Author
New Delhi, First Published Aug 15, 2019, 7:55 AM IST

న్యూఢిల్లీ: భారతదేశం అభివృద్ధికి, పరిరక్షణకు పాటుపడుతున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. 

భారతదేశం కోసం త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులకు అందరికీ వందనాలు తెలిపారు. అనంతరం ఇటీవల సంభవించిన వరదల్లో మృతిచెందిన వారికి మోదీ నివాళులర్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇదే తన ప్రసంగమని చెప్పుకొచ్చారు. 

కేంద్రప్రభుత్వం తరపున తాను ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశించినట్లు ఆర్టికల్ 370ను రద్దు చేసినట్లు తెలిపారు. ఫలితాంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలను సాకారం చేసినట్లు తెలిపారు. 

అలాగే దేశంలో తమ ప్రభుత్వం ఎన్నో అద్భుత చట్టాలను తీసుకువచ్చినట్లు తెలిపారు మోదీ. దేశప్రజలకు పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచినట్లు తెలిపారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు కఠిన చట్టాలను తీసుకువచ్చినట్లు తెలిపారు. 

రాబోయే ఐదేళ్లలో మెరుగైన భారత్ ను నిర్మించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. దేశంలో తాను రెండోసారి ప్రధానిమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 10 వారాల్లోనే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో ఎన్నడూ లేనివిధంగా రైతులందరికీ పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

తమ ప్రభుత్వంపై యువతకు ఎంతో నమ్మకం ఉందన్నారు. వారి నమ్మకాలను నిజం చేస్తానని హామీ ఇచ్చారు. దేశం మారుతుందన్న నమ్మకం ప్రతీ ఒక్కరూ నమ్ముతున్నారని తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

రాజ్ ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళి

రాజ్ నాథ్ సింగ్ అధికారిక నివాసంలో పంద్రాగష్టు వేడుకలు

Follow Us:
Download App:
  • android
  • ios