న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధికారిక నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతదేశానికి రక్షణ కవచంలా ఉంటున్న అశేష సైనికుల సమక్షంలో మువ్వనెన్నల జెండాను ఆవిష్కరించారు రాజ్ నాథ్ సింగ్.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సైనికుల సేవలను కొనియాడారు. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికీ అభినందనలు తెలిపారు రాజ్ నాథ్ సింగ్. అనంతరం అధికారులకు రాజ్ నాథ్ సింగ్ స్వీట్లు పంచుతూ కరచాలనం చేశారు.