Asianet News TeluguAsianet News Telugu

నిజ్జర్ హత్య .. ట్రూడో వ్యాఖ్యల ప్రకంపనలు : ప్రధాని మోడీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. 

PM Narendra Modi meets MEA Jaishankar in Parliament amid row with Canada ksp
Author
First Published Sep 20, 2023, 3:16 PM IST

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే ఆయన ప్రకటను భారత్ ఖండించింది. అలాగే న్యూఢిల్లీలోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోడీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. 

కాగా.. కెనడాలో స్థావరాలను కలిగి ఉన్న ఉగ్రవాద గ్రూపులకు మద్దతిచ్చే వేర్పాటువాద సంస్థలపై చర్య తీసుకోవాలని భారత్ చేసిన అభ్యర్థనను కెనడా పదే పదే పట్టించుకోలేదని భారత అధికారులు తాజాగా వెల్లడించారు. టెర్రర్ గ్రూపులకు మద్దతిచ్చే కనీసం తొమ్మిది వేర్పాటువాద సంస్థలు కెనడాలో తమ స్థావరాలను కలిగి ఉన్నాయని అధికారులను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ నివేదించింది. అనేక బహిష్కరణ అభ్యర్థనలు ఉన్నప్పటికీ.. కెనాడా ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్య తీసుకోలేదని పేర్కొంది. ఇక, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సహా నేరాల్లో కూడా ఈ సంస్థల ప్రమేయం ఉంది.

ALso Read: కెనడాను వదిలేసి భారత్ కు వెళ్లండి.. హిందువులకు సిక్కుస్ ఫర్ జస్టిస్ హెచ్చరిక

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్‌పై కెనడా చేస్తున్న ఆరోపణలు నిరాధారమైన కేంద్ర ప్రభుత్వ అధికారులు వర్గాలు తెలిపాయి. వాంటెడ్ టెర్రరిస్టులు,  గ్యాంగ్‌స్టర్ల బహిష్కరణ అంశాన్ని భారత అధికారులు బహుళ దౌత్య, భద్రతా చర్చలలో లేవనెత్తారని వారు చెప్పారు. అయితే కెనడా మాత్రం ఈ టెర్రర్ ఎలిమెంట్స్‌కు మద్దతుగా నిబద్ధత లేకుండా, నిస్సంకోచంగా ఉండిపోయిందని పేర్కొన్నారు. ‘కెనడా వైపు అనేక పత్రాలు అందజేసినప్పటికీ భారతదేశం బహిష్కరణ అభ్యర్థనలు పరిష్కరించబడలేదు. 

ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న కనీసం ఎనిమిది మంది వ్యక్తులు, పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో కలిసి కుట్రపన్నుతున్న పలువురు గ్యాంగ్‌స్టర్లు కెనడాలో సురక్షిత స్వర్గధామాన్ని కనుగొన్నారు’’ అనిఅధికారులు తెలిపారు. ఈ వ్యక్తుల బహిష్కరణ అభ్యర్థనల విషయానికి వస్తే..  1990ల ప్రారంభంలో ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్న గుర్వంత్ సింగ్‌తో సహా పలు అభ్యర్థనలు కెనడా అధికారుల వద్ద చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు తెలిపారు. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా పెండింగ్‌లో ఉందని  గుర్తుచేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios