Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీ వాడే కారు ధర తెలిస్తే.. కళ్లు తేలేస్తారు.. ఎంతంటే..

తాజాగా మోదీ వాడుతున్న Mercedes Benz Maybach S650 కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు Putin ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్ కు వచ్చిన మోడీ తొలిసారి ఈ కారులో కనిపించారు. ఈ మధ్య Modi convoyలో మరోసారి ఈ వాహనం కనిపించింది. 

PM Narendra Modi gets new Rs 12-crore car
Author
Hyderabad, First Published Dec 28, 2021, 9:54 AM IST

న్యూఢిల్లీ :  ప్రధాని మోదీ వేసుకునే దుస్తులు, ఉపయోగించే వస్తువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా మోదీ సుమారు 10 లక్షల రూపాయల విలువైన సూట్ వేసుకున్నారు. గతంలో ఆయన ధరించిన Maybash sunglassesకూడా వార్తల్లో నిలిచాయి. 

తాజాగా మోదీ వాడుతున్న Mercedes Benz Maybach S650 కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు Putin ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్ కు వచ్చిన మోడీ తొలిసారి ఈ కారులో కనిపించారు. ఈ మధ్య Modi convoyలో మరోసారి ఈ వాహనం కనిపించింది. అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగిన ఈ కారు విలువ 12 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, 2019 డిసెంబర్ లో సూర్యగ్రహణం చూడడానికి మోదీ పెట్టుకున్న సన్ గ్లాసెస్ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోదీ..’చాలామంది భారతీయుల మాదిరిగానే.. నేను కూడా  2019 చివరి సూర్యగ్రహణాన్ని చూడాలని ఆతృతగా ఎదురుచూశాను. కానీ దురదృష్టవశాత్తూ, మబ్బుల కారణంగా నేరుగా చూడలేకపోయాను. కానీ కోజికోడ్, ఇతర ప్రాంతాలలో గ్రహణానికి సంబంధించిన దృశ్యాలను ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడగలిగాను’ అని ట్వీట్ చేశారు. 

Assembly Election 2022: ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల వాయిదాకు అవ‌కాశం లేదు !

ఆ రోజు సంభవించిన సూర్యగ్రహణాన్ని చూసేందుకు అందరిలాగే ప్రధానిగా తానూ చాలా ఆసక్తిగా ఉన్నానంటూ.. అయితే కాస్త నిరాశ చెందినా ఏదో రకంగా ప్రత్యక్ష ప్రసారంలో చూడగలిగానంటూ.. ప్రధాని మోదీ చెబుతూ అది చూసేందుకు తాను చేసిన ప్రయత్నాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు మోదీ. అయితే ఇక్కడ అది కాదు మ్యాటర్. 

దీంతోపాటు ప్రధాని మోదీ షేర్ చేసిన ఫొటోలో సూర్యగ్రహణం వీక్షించేందుకు మోదీ పెట్టుకున్న సన్ గ్లాసెస్ ట్రోల్ అయ్యాయి. ఇవి వైరల్ గా మారాయి. అంతేకాదు వీటి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆ సన్ గ్లాసెస్ బ్రాండ్ ఏంటి, వాటి ధర ఎంత అనే విషయాలపై విపరీతంగా చర్చ చేశారు.

సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ఖరీదైన మేబాష్ సన్ గ్లాసెస్ ఉపయోగించారని, వాటి ధర కనీనం రూ.లక్షకు పైనే ఉంటుందని ఒక వర్గం వాదించగా, అలాంటిదేమీ లేదని, ప్రధాని సాధారమైన షేడ్స్‌నే ధరించారని ఆయన మద్ధతుదారులు ప్రతిగా ట్వీట్లు చేశారు. 

మోదీ రెట్రో బఫెలో హార్న్ బ్రాండ్ సన్ గ్లాసెస్ ధరించారని, వాటి ధర కేవలం రూ. 3000నుంచి రూ.5000మధ్య ఉంటుందని చెబుతూ ఆ సన్ గ్లాసెస్ ఆన్ లైన్ ధర స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios