Modi Zelensky Talks: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో తాజాగా ఫోన్ లో మాట్లాడారు. రష్యా దాడుల గురించి మోడీకి వివ‌రించగా, శాంతి ప్రయత్నాలకు భారత్ అన్ని విధాల మద్దతు ఇస్తుందని భారోసా నిచ్చారు.

Modi Zelensky Talks: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. రష్యా ఉక్రెయిన్ పట్టణాలు, గ్రామాలపై జరిపిన దాడుల వివరాలు ఆయన వెల్లడించారు. జపోరిజ్జియా బస్ స్టేషన్‌పై జరిగిన బాంబు దాడిలో డజన్ల మంది ప్ర‌జలు గాయపడిన విషయం కూడా తెలిపారు. ఈ దాడులు సాధారణ పౌర సదుపాయాలపై కావాలనే జరిపినవని జెలెన్‌స్కీ చెప్పారు.

Scroll to load tweet…

ఈ క్రమంలోనే ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌లో శాంతి పునరుద్ధరణకు భారత్ అంకితభావంతో ఉందని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం భారత్ తన వంతు సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశలో ఇప్పటివరకు అందించిన మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

ఇద్దరు నేతలు పలు ముఖ్యాంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత–ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షిస్తూ, భవిష్యత్తులో పరస్పర ప్రయోజనాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను పరిశీలించారు. రాబోయే రోజుల్లో కూడా సంప్రదింపులు కొనసాగించేందుకు అంగీకరించారు.

Scroll to load tweet…

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు

జెలెన్‌స్కీ-మోడీ సంభాషణ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కీలక దశలో ఉన్న సమయంలో జరిగింది. ఆగస్టు 15న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అలాస్కాలో సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఉక్రెయిన్ పై వార్ ను ఆపే అవకాశాలపై చర్చించనున్నారు.

రష్యా తీరుపై జెలెన్‌స్కీ విమర్శలు

మోడీతో సంభాషణలో జెలెన్‌స్కీ, యుద్ధాన్ని ముగించేందుకు డిప్లమాటిక్ అవకాశాలు ఉన్నప్పటికీ, రష్యా కాల్పుల విరమణకు సిద్ధంగా లేక‌పోవ‌డం ఎత్తిచూపారు. ఆక్రమణ, హత్యలను కొనసాగించే ధోరణి ప్రదర్శిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ భవిష్యత్తు గురించి తీసుకునే ప్రతి నిర్ణయంలో ఉక్రెయిన్ పాల్గొనాలి, లేదంటే ఫలితం రాదని స్పష్టం చేశారు.

శాంతి ప్రయత్నాలకు భారత్ మద్దతు

భారత్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారం కోసం కట్టుబడి ఉందని ప్ర‌ధాని మోడీ పునరుద్ఘాటించారు. శాంతి పునరుద్ధరణకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించి, పరస్పర ప్రయోజనాల రంగాల్లో సహకారం పెంచే మార్గాలపై చర్చించారు. సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా ప్రత్యక్ష సమావేశం, పరస్పర పర్యటనల ప్రణాళికపై ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.