- Home
- Sports
- Cricket
- ICC Womens World Cup 2025: మహిళల వరల్డ్ కప్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. టీమిండియా షెడ్యూల్ ఇదే
ICC Womens World Cup 2025: మహిళల వరల్డ్ కప్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. టీమిండియా షెడ్యూల్ ఇదే
ICC Womens World Cup 2025: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025కి ఇంకా 50 రోజులే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 30న భారత్-శ్రీలంక మ్యాచ్‌తో టోర్నమెంట్ ఆరంభం కానుంది. టీమిండియా పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం.

ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025: ముంబైలో ఘనంగా '50 డేస్ టు గో' ఈవెంట్
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఈసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మెగా టోర్నీకి ఇంకా కేవలం 50 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా క్రికెట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. క్రికెట్ లవర్స్ కు ఇది మరో పండగ.
ఈ క్రమంలోనే ముంబైలో సోమవారం ICC మహిళల ప్రపంచ కప్ 2025కి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్ జై షా ప్రారంభించారు.
ఆయనతో పాటు భారత క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, యువరాజ్ సింగ్, ప్రస్తుత భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, జెమిమా రోడ్రిగ్స్, ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా పాల్గొన్నారు.
KNOW
ఇది మహిళల క్రికెట్‌కు కీలక ఘట్టం : జైషా
జై షా మాట్లాడుతూ.. “ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 తిరిగి భారతదేశానికి రావడం మహిళల క్రికెట్‌కు ఒక కీలక ఘట్టం. ఇది క్రీడ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. మేము ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను స్వీకరిస్తూ మహిళల క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని” అన్నారు. అలాగే, 50 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.
The countdown has begun!
We are now just 50 days away from ICC Women’s Cricket World Cup, 2025.
India previously hosted the Women’s @cricketworldcup in 1978, 1997 and 2013. #CWC25pic.twitter.com/HEqoLflqqc— BCCI Women (@BCCIWomen) August 11, 2025
ICC Womens World Cup 2025: ముంబైలో ఐసీసీ ట్రోఫీ టూర్ ప్రారంభం
ఈ వేడుకలో భాగంగా ఐసీసీ ట్రోఫీ టూర్‌ను అధికారికంగా ప్రారంభించింది. ట్రోఫీ ముంబై నుంచి మొదలై, టోర్నమెంట్ హోస్ట్ నగరాలన్నింటినీ సందర్శిస్తుంది. ఢిల్లీతో పాటు పలు ముఖ్య ప్రదేశాల్లో అభిమానులకు ట్రోఫీని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది.
స్కూల్ లెగసీ ప్రోగ్రామ్‌లో భాగంగా, హోస్ట్ నగరాల పాఠశాలల్లో ట్రోఫీని ప్రదర్శిస్తారు. అలాగే, బీసీసీఐ, ఐసీసీ సహా ఇతర భాగస్వాములు కలిసి కొన్ని ఎంపికైన పాఠశాలలకు మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పిస్తారు.
The road to #CWC25 came alive in Mumbai with a star-studded ‘50 Days to Go’ event 😍
➡️ https://t.co/ZUzo4YTzZqpic.twitter.com/qcnEisZYuC— ICC (@ICC) August 11, 2025
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025: భారత జట్టు షెడ్యూల్
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వాటిలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు ఉన్నాయి.
ప్రారంభ మ్యాచ్: సెప్టెంబర్ 30 - భారత్ vs శ్రీలంక, బెంగళూరు
భారత్ vs పాకిస్తాన్: అక్టోబర్ 5 - కొలంబో
భారత్ vs ఆస్ట్రేలియా: అక్టోబర్ 12 - విశాఖపట్నం
భారత్ vs ఇంగ్లాండ్: అక్టోబర్ 19 - ఇండోర్
భారత్ vs న్యూజిలాండ్: అక్టోబర్ 23 - గౌహతి
ఫైనల్: నవంబర్ 2 - కొలంబో లేదా బెంగళూరు
భారత జట్టుపై భారీ అంచనాలు
2017 మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈసారి ఆ తప్పిదాన్ని సరిదిద్దుకొని కప్ గెలవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ నాలుగోసారి మహిళల ప్రపంచ కప్‌ను ఆతిథ్యం ఇస్తోంది. అంతకు ముందు 1978, 1997, 2013లో ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 పూర్తి షెడ్యూల్
సెప్టెంబర్ 30 - భారత్ vs శ్రీలంక - బెంగళూరు
అక్టోబర్ 1 - ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ - ఇండోర్
అక్టోబర్ 2 - బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ - కొలంబో
అక్టోబర్ 3 - ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా - బెంగళూరు
అక్టోబర్ 4 - ఆస్ట్రేలియా vs శ్రీలంక - కొలంబో
అక్టోబర్ 5 - భారత్ vs పాకిస్తాన్ - కొలంబో
అక్టోబర్ 6 - న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా - ఇండోర్
అక్టోబర్ 7 - ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ - గౌహతి
అక్టోబర్ 8 - ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ - కొలంబో
అక్టోబర్ 9 - భారత్ vs దక్షిణాఫ్రికా - విశాఖపట్నం
అక్టోబర్ 10 - న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ - విశాఖపట్నం
అక్టోబర్ 11 - ఇంగ్లాండ్ vs శ్రీలంక - గౌహతి
అక్టోబర్ 12 - భారత్ vs ఆస్ట్రేలియా - విశాఖపట్నం
అక్టోబర్ 13 - దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్ - విశాఖపట్నం
అక్టోబర్ 14 - న్యూజిలాండ్ vs శ్రీలంక - కొలంబో
అక్టోబర్ 15 - ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ - కొలంబో
అక్టోబర్ 16 - ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ - విశాఖపట్నం
అక్టోబర్ 17 - దక్షిణాఫ్రికా vs శ్రీలంక - కొలంబో
అక్టోబర్ 18 - న్యూజిలాండ్ vs పాకిస్తాన్ - కొలంబో
అక్టోబర్ 19 - భారత్ vs ఇంగ్లాండ్ - ఇండోర్
అక్టోబర్ 20 - శ్రీలంక vs బంగ్లాదేశ్ - కొలంబో
అక్టోబర్ 21 - దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ - కొలంబో
అక్టోబర్ 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ - ఇండోర్
అక్టోబర్ 23 - భారత్ vs న్యూజిలాండ్ - గౌహతి
అక్టోబర్ 24 - పాకిస్తాన్ vs శ్రీలంక - కొలంబో
అక్టోబర్ 25 - ఆస్ట్రేలియా vs శ్రీలంక - ఇండోర్
అక్టోబర్ 26 - ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ - గౌహతి
అక్టోబర్ 26 - భారత్ vs బంగ్లాదేశ్ - బెంగళూరు
అక్టోబర్ 29 - సెమీఫైనల్ 1 - గౌహతి/కొలంబో
అక్టోబర్ 30 - సెమీఫైనల్ 2 - బెంగళూరు
నవంబర్ 2 - ఫైనల్ - కొలంబో/బెంగళూరు