Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
Modi Twitter Account Hacked: గత కొంత కాలంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ అధికారిక వెబ్ సైట్లు, ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రిటీల ఖాతాలను హ్యాక్ చేయడం వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం రెండు గంటల సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతను హ్యాక్ చేశారు.
Modi Twitter Account Hacked: ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రధానమైన వెబ్‌సైట్లు లక్ష్యంగా సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం కూడా అధికమైంది. గత కొన్ని రోజులుగా భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారు జామున దేశ ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు గురైందంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా ప్రకటించింది. గత కొంత కాలంగా క్రిప్టోకరెన్సీ సహా బిట్ కాయిన్లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం క్రిప్టోకరెన్సీపై కీలక నిర్ణయం తీసుకుంటుందని చర్చ జరిగింది. అయితే, ప్రభుత్వం క్రిప్టోకరెన్సీ కి వ్యతిరేకంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Bank privatisation: కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్ల సంచలన నిర్ణయం
ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు.. ప్రధాని మోడీ ట్విట్టరట్ ఖాతాను హ్యాక్ చేశారు. ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో హ్యాకర్స్ మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ గురైంది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) తన ట్విటర్ అకౌంట్ హ్యాండిల్ ద్వారా గంట తర్వాత... అంటే ఆదివారం 3 గంటలకు తెలిపింది. హ్యాక్ అయిన విషయాన్ని సైతం ట్విట్టర్ సమాచారం అందించినట్టు పేర్కొంది. దీనిపై వెంటనే స్పందించిన ట్విట్టర్.. ప్రధాని మోడీ అకౌంట్‌కు భద్రత కల్పించింది. ప్రస్తుతం ఖాతా పునరుద్ధరించారు. హ్యాక్ గురైన సమయంలో బిట్ కాయిన్ల గురించి మోడీ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. అందులో.. "భారతదేశం అధికారికంగా బిట్‌కాయిన్‌ను చట్టబద్ధమైన టెండర్‌గా స్వీకరించింది. ప్రభుత్వం అధికారికంగా 500 BTCలను కొనుగోలు చేసింది. వీటిని దేశ ప్రజలందరికీ పంపిణీ చేస్తుంది" అని ప్రధాని మోడీ టైమ్‌లైన్‌లో ట్వీట్ చేయబడింది.
Also Read: UP assembly elections 2022: యూపీ ఎన్నికల్లో 350కిపైగా సీట్లు గెలుస్తాం: యూపీ సీఎం యోగి
ఈ ట్విట్ విస్తృతంగా షేర్ చేసిన తర్వాత.. మోడీ ఖాత పునరుద్దరించబడింది. ఆ తర్వాత బిట్‌కాయన్‌పై చేసిన ట్వీట్ తొలగించారు. ఇదిలావుండగా, గతంలోనూ ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ గురైంది. 2020 సెప్టెంబర్ ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ గురైంది. ఆ సమయంలోనూ క్రిప్టోకరెన్సీపై ట్వీట్లు పోస్ట్ చేయబడ్డాయి. అలాగే, క్రిప్టో కరెన్సీ రూపంలో మోడీ సహాయనిధికి విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్లు కూడా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రధాని రిలీఫ్ ఫండ్‌కి విరాళం అందించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానీ, క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ల రూపంలో అందించాలనీ అప్పటి ట్వీట్ లలో పేర్కొన్నారు.
Also Read: Coronavirus: తగ్గిన కరోనా కొత్త కేసులు.. పెరిగిన మరణాలు