turkey-syria earthquake: టర్కీని భూకంపం కారణంగా ఏకంగా 365 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయ‌నీ, దీని  తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదయిందని జీఎఫ్ జెడ్ నివేదించింది. 

PM Modi condoles the loss of earthquake: ట‌ర్కీ లో వ‌చ్చిన భూకంపం కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం ప్ర‌క‌టించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. భాదితుల‌కు సానుభూతి తెలిపారు. టర్కీని భూకంపం కుదిపేసింది. పెద్ద సంఖ్య‌లో భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. ఈ ప్ర‌కృతి విప‌త్తు కార‌ణంగా ఏకంగా 365 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయ‌నీ, దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదయిందని జీఎఫ్ జెడ్ నివేదించింది.

వివ‌రాల్లోకెళ్తే.. టర్కీలో 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా టర్కీలో సంభవించిన ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సంతాపం తెలిపారు. టర్కీలో భూకంపం కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినందుకు చింతిస్తున్నట్లు ప్రధాని మోడీ త‌న‌ ట్వీట్ లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయ‌న‌.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. టర్కీ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుంద‌నీ, ఈ విషాద స‌మ‌యంలో వారికి అండ‌గా అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

Scroll to load tweet…

ట‌ర్కీలో హై అల‌ర్ట్.. 

సోమవారం (ఫిబ్రవరి 6) ఉదయం టర్కీ-మధ్యప్రాచ్యంలో రెండు శక్తివంతమైన భూకంపాల ప్రకంపనలు సంభవించాయి. అంతటా విధ్వంస దృశ్యం కనిపిస్తోంది. మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 360 మంది చనిపోయారని అంత‌ర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదే సమయంలో వెయ్యి మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మరణించిన వారిలో ఎక్కువ మంది మాల్టా-సాన్లుయిర్ఫాకు చెందినవారు. టర్కీలోని అదానా నగరంలో 17 అంతస్తులు, 14 అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.17 గంటలకు మొదటి భూకంపం సంభవించగా, కొన్ని నిమిషాల తర్వాత సెంట్రల్ టర్కీలో రెండో ప్రకంపనలు సంభవించాయి. 

టర్కీలో ఈ భూకంపం తీవ్రత రియాక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదైంది. దక్షిణ టర్కీలో ఈ భూకంపం సంభవించింది. ఇక్కడ చాలా అపార్ట్‌మెంట్లు కూలిపోయాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. అదే సమయంలో, భూకంపం తరువాత, టర్కీ అంతర్జాతీయ సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. పొరుగు ప్రావిన్సులైన మలత్యా, దియార్‌బాకిర్, మలత్యలో అనేక భవనాలు కూలిపోయాయని హాబర్‌టర్క్ టెలివిజన్ నివేదించింది. 

ఈ 10 నగరాల్లో భారీ నష్టం..

BNO న్యూస్ ప్రకారం, సిరియాలో కూడా భారీ నష్టం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడ 86 మంది మరణించగా, 200 మంది గాయపడ్డారు. దేశంలోని 10 నగరాలపై భూకంపం తీవ్ర ప్రభావం చూపిందని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ షోయ్లు తెలిపారు. వీటిలో కహ్మెన్‌మార్ష్, హటే, గజియాంటెప్, ఉస్మానియే, అడియామాన్, సాన్లియుర్ఫా, మలత్య, అదానా, దియార్‌బాకిర్, కిలిస్ లు ఉన్నాయి. శక్తివంతమైన భూకంపం తర్వాత హై అలర్ట్ ప్రకటించబడినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని ఈ వీడియోల్లో స్పష్టంగా చూడవచ్చు.

Scroll to load tweet…