Asianet News TeluguAsianet News Telugu

పీఎఫ్ఐ నిషేధం రాజ్యాంగ విరుద్ధం - ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ

పీఎఫ్ఐలో కొందరు సభ్యులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఆ సంస్థ మొత్తాన్నే నిషేదించడం సరైంది కాదని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆ సంస్థను నిషేదించడం రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పారు. 

PFI ban unconstitutional - AIMIM leader Asaduddin Owaisi
Author
First Published Sep 28, 2022, 3:38 PM IST

తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై నిషేధానికి తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌లేమ‌ని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అయితే నేరానికి పాల్పడిన కొందరి వ‌ల్ల ఆ సంస్థ మొత్తాన్ని నిషేదించ‌డంలో అర్థం లేద‌ని తెలిపారు. పీఎఫ్ఐ నిషేధం క్రూరమైనదని పేర్కొన్న ఒవైసీ, ఇది యూఏపీఏ చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి పెద్ద దెబ్బ అని అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న బుధవారం ‘టైమ్స్ నౌ’తో మాట్లాడారు.

మూర్ఖుల ఆరోప‌ణ‌లకు స్పందించ‌ను.. ఆర్ఎస్ఎస్ నిషేదించాల‌నే డిమాండ్ పై దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కామెంట్స్

కొంతమంది సభ్యుల చర్యల ఆధారంగా ఒక సంస్థను నిషేధించరాదని సుప్రీం కోర్టు చేసిన ఒవైసీ గుర్తు చేశారు. యూఏపీఏ చట్టం క్రూరమైందని, దీని వల్ల చాలా మంది ముస్లింలు హింసకు గురయ్యారని, జైలుకు వెళ్లారని చెప్పారు. పీఎఫ్ఐపై సభ్యుల రాడికల్, తీవ్రమైన కార్యకలాపాలను తాను ఎప్పుడూ వ్యతిరేకిస్తానని ఒవైసీ తన వైఖరిని స్పష్టం చేశారు. ఆ సంస్థ సభ్యుల్లో కొందరే చట్టాన్ని ఉల్లంఘించారని, అందుకే తాను మద్దతు ఇవ్వలేనని అన్నారు.

ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ కేసులో చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యంలకు బెయిల్

పీఎఫ్ఐపై కేంద్రం భారీ అణచివేత నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సహకారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 100కి పైగా పీఎఫ్ఐ ప్రదేశాలపై దాడి చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలకు చెందిన 247 మంది సభ్యులను అరెస్టు చేసింది.

ఐఎస్ఐఎస్, ఇతర ఉగ్రవాద సంస్థలతో పీఎఫ్ఐకి సంబంధాలున్నాయని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంటూ ఆ సంస్థను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిషేధిత సంస్థ పీఎఫ్ఐ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, సిమిలతో సంబంధాలున్నాయని మంగళవారం రాత్రి విడుదల చేసిన తన నోటిఫికేషన్ లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. 

దేశం చెక్కు చెద‌ర‌కూడ‌దంటే పీఎఫ్‌ఐపై నిషేధం ఉండాల్సిందే- బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్

ఆ నోటిఫికేషన్ లో ‘‘ పీఎఫ్ఐ, దాని అసోసియేట్‌లు, అనుబంధ సంస్థలు, ఫ్రంట్‌లు బహిరంగంగా సామాజిక-ఆర్థిక, విద్యా, రాజకీయ సంస్థగా పనిచేస్తాయి. అయితే అందులో పని చేసేవారు ప్రజాస్వామ్య భావనను అణగదొక్కడానికి, అగౌరవపరిచే దిశగా పనిచేస్తున్నారు. సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని సమూలంగా మార్చడానికి రహస్య ఎజెండాను అనుసరిస్తున్నారు.’’  అని తెలిపింది. పీఎఫ్ఐ, దాని సహచర, అనుబంధ సంస్థలు, ఫ్రంట్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, ఇవి దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భద్రతకు విఘాతం కలిగిస్తాయని తెలిపింది.

దొంగబాబాల మాట నమ్మి.. సజీవసమాధిలోకి వెళ్లిన యువకుడు.. పోలీసులు రావడంతో..

దేశంలోని ప్రజా శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. దేశంలో సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) వ్యతిరేక నిరసనలకు ఆజ్యం పోయడానికి నిధులను సమీకరించడంలో ఈ సంస్థ ప్రమేయాన్ని ఈడీ దర్యాప్తు బహిర్గతం చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios