Asianet News TeluguAsianet News Telugu

మూర్ఖుల ఆరోప‌ణ‌లకు స్పందించ‌ను.. ఆర్ఎస్ఎస్ నిషేదించాల‌నే డిమాండ్ పై దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కామెంట్స్

పీఎఫ్ఐతో పాటు ఆర్ఎస్ఎస్ ను కూడా నిషేధించాలని పలు పార్టీల నుంచి డిమాండ్ లు వస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 

Devendra Fadnavis's comments on the demand to ban RSS will not respond to the accusations of idiots
Author
First Published Sep 28, 2022, 2:57 PM IST

ఆర్ఎస్ఎస్ ను నిషేధించాల‌ని ప‌లు పార్టీల నాయ‌కులు డిమాండ్ చేస్తున్న నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స్పందించారు. నిరాదార‌ణ‌మైన ఆరోపణలు చేసే మూర్ఖులకు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. ‘‘ కొంద‌రు మూర్ఖులున్నారు.  ఈ దేశంలో చట్టాలు, రాజ్యాంగం ఉన్నాయి. వారు ఏ రాష్ట్రంలోనైనా ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా ఒక్క ఘటనను అయినా క‌నుగొన‌గ‌లిగారా ? బీజేపీ పాలిత రాష్ట్రాన్ని మర్చిపోండి, ఇతర పార్టీ పాలిత రాష్ట్రాల సంగతేమిటి? బీజేపీయేతర పాలిత రాష్ట్రం పీఎఫ్ఐపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. కాబట్టి నిరాధారమైన ఆరోపణలు చేసే మూర్ఖులకు ప్రతిస్పందించడంలో అర్థం లేదు ’’ అని ఆయన తెలిపారు.

ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్ కేసులో చిత్రా రామకృష్ణ, ఆనంద్ సుబ్రమణ్యంలకు బెయిల్

పీఎఫ్ఐ, ఆరు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసిందని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని తెలిపారు. మహారాష్ట్రలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నించిన సంస్థ ఇదే అని అన్నారు. ఇదే సంస్థ మహారాష్ట్రలోని త్రిపుర నుంచి వీడియోలను సర్క్యులేట్ చేసి రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నించింద‌ని పేర్కొన్నారు. ఇదే సంస్థ‌కు చెందిన వివిధ ఖాతాల‌ను, అనుబంధ సంస్థలను పరిశీలిస్తాము అని చెప్పారు.

ఢిల్లీకి చేరుకున్న రాజస్థాన్ సీఎం : సోనియాతో భేటీ కానున్న ఆశోక్ గెహ్లాట్

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ కె సురేష్, తదితరులతో పాటు పలువురు నేతలు ఆర్ఎస్ఎస్ ను కూడా నిషేధించాలని కోరారు. పీఎఫ్‌ఐపై దర్యాప్తు జరుగుతోందని, దాంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ను నిషేదించాల‌ని, విచార‌ణ జ‌ర‌పాల‌ని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అలాగే పీఎఫ్‌ఐ మాత్రమే ఎందుక‌ని ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా నిషేధించండి అని కాంగ్రెస్ ఎంపీ కొడికున్ని సురేష్ అన్నారు. 

కాగా.. శాంతికి భంగం కలిగించే లేదా చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ఎవరిపైనా చర్యలు తీసుకోవడానికి తాము అభ్యంతరం చెప్పబోమ‌ని కాంగ్రెస్ నేత సిద్ద‌రామ‌య్య అన్నారు. ఆరెస్సెస్, ఇతరులు కూడా అదే విధంగా శాంతికి భంగం కలిగిస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, అలాంటి సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు. 

ఢిల్లీలో దారుణం.. వైద్యురాలిపై జైలులోనే ఖైదీ అత్యాచారం, హత్యాయత్నం..

ఇదిలా ఉండ‌గా.. మంగ‌ళ‌వారం రాత్రి పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించింది. ఆ సంస్థ‌ల‌కు ఉగ్ర‌వాద లింకులు ఉన్నాయ‌ని కార‌ణంగా పేర్కొంటూ ఐదేళ్ల పాటున నిషేధం విధించింది. ఈ మేర‌కు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)  నోటిఫికేష‌న్ జారీ చేసింది. ‘‘ పీఎఫ్ఐ, దాని అసోసియేట్‌లు, అనుబంధ సంస్థలు, ఫ్రంట్‌లు బహిరంగంగా సామాజిక-ఆర్థిక, విద్యా, రాజకీయ సంస్థగా పనిచేస్తాయి. అయితే అందులో పని చేసేవారు ప్రజాస్వామ్య భావనను అణగదొక్కడానికి, అగౌరవపరిచే దిశగా పనిచేస్తున్నారు. సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని సమూలంగా మార్చడానికి రహస్య ఎజెండాను అనుసరిస్తున్నారు. ’’ అని తెలిపింది. పీఎఫ్ఐ, దాని సహచర, అనుబంధ సంస్థలు, ఫ్రంట్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, ఇవి దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భద్రతకు విఘాతం కలిగిస్తాయని, దేశంలోని ప్రజా శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios