ప్రజల సొమ్మును పార్టీల విస్తరణ కోసం కాకుండా దేశాభివృద్ధికి ఉపయోగించాలే చూడాలి - బ్యూరోక్రాట్లకు ప్రధాని సలహా

ప్రజలు ట్యాక్స్ ల రూపంలో చెల్లించే సొమ్మును అధికార పార్టీలు తమ పార్టీ విస్తరణ కోసం కాకుండా, దేశ అభివృద్ధి కోసం వినియోగించేలా చూడాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ సివిల్ సర్వెంట్లను కోరారు. 16వ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Peoples money should be used for national development and not for party expansion - PM's advice to bureaucrats..ISR

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పన్ను చెల్లింపుదారుల సొమ్మును పార్టీ కార్యకలాపాల విస్తరణ కోసం కాకుండా దేశాభివృద్ధికి వినియోగించేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ బ్యూరోక్రాట్లకు సలహా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్న డబ్బులను పార్టీ ప్రయోజనాలకు వినియోగిస్తోందా లేక దేశ ప్రయోజనాల కోసం వినియోగిస్తోందా అనేది అంచనా వేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని అన్నారు. 16వ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అస్సాంలో భీకర తుఫాను.. దెబ్బతిన్న 400 నివాసాలు.. ఇళ్లు కూలడంతో ఏడేళ్ల మృతి..

ఈ సందర్భంగా ప్రధాని సివిల్ సర్వెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఒక రాజకీయ పార్టీ తన ఓటు బ్యాంకును సృష్టించుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటుందా ? లేక ప్రతీ ఒక్కరి జీవితాన్ని సులభతరం చేసేందుకు కృషి చేస్తోందా? అనేది అధికార యంత్రాంగం పరిశీలించాలి’’ అని అన్నారు. ‘‘అధికారంలోకి వచ్చిన ఆ రాజకీయ పార్టీ ప్రభుత్వ సొమ్ముతో తనను తాను ప్రమోట్ చేసుకుంటోందా లేక నిజాయితీగా ప్రజలకు అవగాహన కల్పిస్తోందా? ఆ రాజకీయ పార్టీ వివిధ సంస్థల్లో సొంత కార్యకర్తలను నియమించుకుంటుందా లేక పారదర్శకంగా అందరికీ ఉద్యోగాలు పొందే అవకాశం కల్పిస్తోందా? అనేది గమనించాలి’’ అని అన్నారు.

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు..

బ్యూరోక్రసీని ‘భారతదేశపు ఉక్కు ఫ్రేమ్’గా సర్దార్ పటేల్ అభివర్ణించారని గుర్తు చేసిన ప్రధాని మోదీ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే బ్యూరోక్రసీ చిరస్మరణీయ వారసత్వాన్ని విడిచిపెట్టగలదని అన్నారు. ప్రజా కేంద్రీకృత పాలన సమస్యలకు పరిష్కారం చూపి మెరుగైన ఫలితాలను ఇస్తుందని తెలిపారు. మన విధులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు స్వాతంత్ర్య శతాబ్దం దేశానికి స్వర్ణ శతాబ్దం అవుతుందని అన్నారు. కర్తవ్యం మాకు ఐచ్ఛికం కాదు, పరిష్కారం' అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఈ ప్రసంగం సందర్భంగా గత ప్రభుత్వ విధానాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన ప్రధాని.. గడిచిన తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం నాలుగు కోట్లకు పైగా నకిలీ గ్యాస్ కనెక్షన్లు, నాలుగు కోట్లకు పైగా నకిలీ రేషన్ కార్డులను గుర్తించిందని చెప్పారు. మహిళలు, పిల్లల పథకాల్లో కోటి మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నారని, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 30 లక్షల మంది యువతకు నకిలీ స్కాలర్ షిప్ లను అందిస్తోందని, ఎంఎన్ ఆర్ ఈజీఏ కింద సృష్టించిన లక్షలాది నకిలీ ఖాతాలను గుర్తించి తొలగించామని ప్రధాని చెప్పారు. ఈ నకిలీ లబ్దిదారుల సాకుతో ఇలాంటి అవినీతి వ్యవస్థ ఆవిర్భవించిందని ప్రధాని అన్నారు.

చంద్రబాబు నాయుడి వాహనంపై రాళ్ల దాడి.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి రక్షణ కల్పించిన భద్రతా సిబ్బంది

సుమారు రూ.3 లక్షల కోట్లు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా కాపాడిన వ్యవస్థలో మార్పు తెచ్చినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ మొత్తాన్ని పేదల సంక్షేమానికి వినియోగిస్తున్నామని అన్నారు. గతంలో ప్రభుత్వం అన్నీ చేస్తుందని ప్రజల్లో ఆలోచించేవారని, కానీ ఇప్పుడు 'ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుంది' అనే ఆలోచన ఉందన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios