జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు..

జగిత్యాల జిల్లాలో ఓ బస్సును లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో 25 మందికి గాయాలు అయ్యాయి. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

Fatal road accident in Jagitiyala.. A lorry collided with a bus.. 25 people of the same family were injured..ISR

జగిత్యాల జిల్లాలో ఓ బస్సును లారీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే ఫ్యామీలికి చెందిన 25 మందికి గాయాలు అయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్రంగా గాయాలవడంతో వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్‌గాంకు చెందిన ఓ వృద్ధురాలు ఇటీవల మరణించారు. దీంతో ఆమె అస్థికలను జగిత్యాల జిల్లాలో ఉన్న ధర్మపురి సమీపంలోని గోదావరి నదిలో కలపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

అయోధ్యలో బస్సు, ట్రక్కు ఢీ.. ఏడుగురు దుర్మరణం, 40 మందికి గాయాలు

దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు బస్సు మాట్లాడుకొని శుక్రవారం ధర్మపురికి బయలుదేరారు. ఆ బస్సులో ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 25 మంది ఉన్నారు. అయితే ఆ బస్సు ఎండ‌ప‌ల్లి మండ‌లం కొత్త‌పేట వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న అందరికీ గాయాలు అయ్యాయి.

టిక్కెట్ ఇవ్వలేదని కోపం లేదు.. ప్రధాని మోడీతో వీడియో కాల్ లో కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప

ఈ ప్రమాదంపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. లారీ ఎదురుగా ఢీకొట్టడం వల్ల డ్రైవర్ తన క్యాబిన్ లో చిక్కుకుపోయాడు. పోలీసులు అతడిని బయటకు తీశారు. క్షతగాత్రులను అందరినీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో 5 గురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios