Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు నాయుడి వాహనంపై రాళ్ల దాడి.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుపెట్టి రక్షణ కల్పించిన భద్రతా సిబ్బంది

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడి వాహనంపై రాళ్ల దాడి జరిగింది. దీంతో భద్రతా అధికారులు స్పందించి ఆయనకు రాళ్ల దాడి నుంచి రక్షణ కల్పించారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా పెట్టారు. 

Stones attack on Chandrababu Naidu's vehicle Security personnel barricaded in bullet proof jackets..ISR
Author
First Published Apr 22, 2023, 8:53 AM IST

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి వాహనంపైరాళ్ల దాడి జరిగింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అలెర్ట్ అయ్యారు. ఆయనకు దెబ్బలు తగలకుండా తమ వద్ద ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టారు. రాళ్ల దాడి నుంచి రక్షణ కల్పించారు. ప్రశాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన 25 మందికి గాయాలు..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మార్కాపురంలో పర్యటన ముగించుకున్నారు. సాయంత్రం యర్రగొండపాలెంకు బయలుదేరారు. అయితే ఆయన పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. నల్ల బెలూన్లు, ఫ్లకార్డులతో చంద్రబాబు రోడ్ షోను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు యత్నించాయి. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

పదేళ్లలో 300మంది హత్య.. విషపుసూదితో ప్రాణాలు తీశాను.. వీడియో వైరల్...

అయితే చంద్రబాబు నాయుడి పర్యటన యర్రగొండపాలేనికి చేరుకోగానే 200 మంది రోడ్డు పై నిలబడి బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలు, బెలూన్లు ప్రదర్శించారు. ఈ సమయంలో ఒక్క సారిగా ఆయన వాహనంపై రాళ్ల దాడి జరిగింది. దీంతో ఎన్ఎస్ జీ కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయాలు అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. చంద్రబాబు నాయుడికి గాయాలు కాకుండా భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుపెట్టారు.

అస్సాంలో భీకర తుఫాను.. దెబ్బతిన్న 400 నివాసాలు.. ఇళ్లు కూలడంతో ఏడేళ్ల మృతి..

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన చంద్రబాబు నాయుడు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆఫీసు ఎదుట తన వాహనాన్ని నిలిపారు. తన జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఈ సమయంలో అక్కడి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో మళ్లీ వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు జెండాలను మంత్రి ఆఫీసుపైకి వేశారు. ఇదే సమయంలో మంత్రిని పోలీసులు ఆఫీసులోకి తీసుకెళ్లారు. కాగా..ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios