Asianet News TeluguAsianet News Telugu

పెరిగిన ప్ర‌జా ఫిర్యాదులు.. పార్ల‌మెంట్ నాల్గో రోజు అంశాలివిగో !

ఈ ఏడాది శీతాకాల స‌మావేశాలు ప్రారంభం ప్రారంభమే ర‌భ‌స‌తో మొద‌ల‌య్యాయి. ఇంకా ఇప్ప‌టికే ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతున్న‌ది. వ‌రుస‌గా నాల్గోరోజు కూడా ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ర‌భుత్వ తీరును విమ‌ర్శించారు. తాజాగా స‌స్పెండైన నేత‌ల‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త బిల్లుకు రెండు స‌భ‌ల్లో ఆమోదం ల‌భించింది. 
 

parliament roundup on day 4
Author
Hyderabad, First Published Dec 2, 2021, 6:36 PM IST

పార్లమెంటు (parliament) శీతాకాల సమావేశాలు నాలుగో రోజు కూడా విపక్షాల నిరసనలు, ఆందోళ‌న‌లతో ముందుకు సాగాయి. దిగువ స‌భ‌తో పాటు ఎగువ స‌భ‌లోనూ కీల‌కమైన ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు సంబంధించి అధికార పార్టీ ప‌ట్టువీడ‌కుండా ముందుకు సాగింది. ఈ క్ర‌మంలో ప్రతిప‌క్ష పార్టీల నేత‌ల నిర‌స‌న‌ల‌తో లోక్‌స‌భ‌తో పాటు రాజ్య‌స‌భ‌లోనూ ర‌భ‌స కొన‌సాగింది.  ఇలాంటి ప‌రిస్థితులు కొన‌సాగుతుండ‌గానే ప్ర‌భుత్వం ప‌లు బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించింది. వాటిలో  సహాయక పునరుత్పత్తి సాంకేతిక (నియంత్రణ) బిల్లు సైతం ఉంది. అలాగే, ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త‌కు సంబంధించిన బిల్లును (Dam Safety Bill 2019) సైతం లోక్‌స‌భ‌, రాజ్య స‌భ‌ల్లో ప్ర‌వేశ‌పెట్టారు. రెండు స‌భ‌ల్లోనూ ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. ఈ బిల్లుకు  అధికార ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు వైకాపా కూడా సానుకూలత వ్యక్తంచేసింది. 

Also Read: ఇంటర్నెట్ సస్పెన్షన్.. దేశానికి అప్ర‌తిష్ట !

అయితే, ప్ర‌తిప‌క్ష పార్టీలు మాత్రం ఈ బిల్లును వ్య‌తిరేకించాయి. ఆనకట్టల భద్రత పేరుతో కేంద్ర ప్రభుత్వం తమ అధికారాల్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తోంద‌ని ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల ఆరోపించారు.  ఈ బిల్లు చ‌ట్ట రూపం దాల్చితే దేశ సమాఖ్య విధానానికి ముప్పు ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. దీనిని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.  అయితే, అధికార పార్టీ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీని వ‌ల్ల అనేక ఉప‌యోగాలు ఉన్నాయ‌ని పేర్కొంటూ ప్ర‌తిప‌క్ష పార్టీల నేతలు చేసిన ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టింది. రెండు స‌భ‌ల్లోనూ గంద‌ర‌గోళం మ‌ధ్యే  ఆనకట్టల భద్రతా బిల్లును ఉభయసభలు ఆమోదం ల‌భించింది. 

Also Read: దేశంలోనే అతిపెద్ద సైబ‌ర్ మోసం.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

ఇక యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్  (omicron)పైనా కూడా పార్ల‌మెంట్ చ‌ర్చ జ‌రిగింది. ఒమిక్రాన్ నేప‌థ్యంలో అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కేంద్రం తెలిపింది. విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా మాట్లాడుతూ.. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా విమాన‌యానంపై ప్ర‌భావం ప‌డింద‌న్నారు. తాత్కాలికంగా నిలిచిపోయిన అంత‌ర్జాతీయ విమాన రాక‌పోల‌క‌లను గ‌త ఆరు నెల‌లుగా పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌చ్చామ‌న్నారు. అయితే, ప్ర‌స్తుతం మ‌ళ్లీ క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావ‌డం అంద‌రినీ ప్ర‌మాదంలోకి నెట్టింద‌నీ, అంద‌రికీ ఇది ఎదురుదెబ్బ అని అన్నారు. 

Also Read:  మాజీ మిస్ కేర‌ళ మృతి కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి...

ఇదిలావుండ‌గా, ఆన్‌లైన్ ఫిర్యాదులు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని కేంద్రం వెల్ల‌డించింది. గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో ఆన్‌లైన్ ద్వారా  57 లక్షలకు పైగా ప్రజా ఫిర్యాదులను అందుకున్నామ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఓ స‌భ్యుడు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర‌ స‌హాయ మంత్రి  జితేంద్ర సింగ్ లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో పై వివ‌రాలు వెల్ల‌డించారు. అలాగే, స్వీక‌రించిన మొత్తం ప్ర‌జా ఫిర్యాదుల్లో 54.65 లక్షల ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు.  ఇదిలావుండ‌గా, జ‌మ్మూకాశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న హింస‌, హ‌త్య‌లు, ప‌ర్వేజ్ అరెస్టు గురించి రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగాయి.  ఎంపీల సస్పెన్షన్ ఎత్తేయాలని రాజ్యసభలో  విపక్షాల నిరసనలు చేశాయి.  సస్పెండైన రాజ్యసభ ఎంపీలు పార్లమెంంటు బయట ధర్నా కొనసాగించారు.  వీరిని రాహుల్ గాంధీ క‌లిసి వారికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios