Asianet News TeluguAsianet News Telugu

మాజీ మిస్ కేర‌ళ మృతి కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి...

మాజీ మిస్​ కేరళ అన్సీ కబీర్, రన్నరప్​ అంజనా మృతి కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. మొద‌టి నుంచి ఈ ప్ర‌మాద‌నికి సంబంధించి పోలీసులు అనేక అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల ద‌ర్యాప్తు ప‌లు కీల‌క విష‌యాలు వెలుగుచూశాయి. 
 

Kerala Models Killed In Car Crash Were Chased By Drug Addict
Author
Hyderabad, First Published Dec 2, 2021, 11:01 AM IST

మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌ (Ansi Kabir Former Miss Kerala ) , రన్నరప్‌ అంజనా (rormer Runnerup anjana) లు నవంబర్‌ 1న జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.  ఈ సంఘటనలో అన్సీ కబీర్‌, అంజనాలు అక్కడిక్కడే మృతి చెందారు. కేర‌ళ‌లోని  కొచ్చి సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంపై ముందునుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే పోలీసులు విభిన్న కోణాల్లో ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇందులో విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

మొదట ప్రమాదంగానే కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో కీలక విష‌యాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చారు. ఈ ప్ర‌మాదానికి ముందు వీరు ఫోర్ట్‌ కొచ్చి ప్రాంతంలో ఉన్న హైఎండ్‌ హోటల్‌లో ఓ పార్టీ హాజరయినట్లు పోలీసులు తెలిపారు. మొద‌ట మాద‌క‌ద్ర‌వ్యాల‌తో సంబంధం ఉన్న వ్య‌క్తులు అన్సీ, అంజనా ప్రయాణిస్తున్న కారు ను మరో కారు వెంబడించడంతోనే.. వారి నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలోనే వేగంగా వెళ్ల‌డంతో ప్ర‌మాదం జ‌రిగింద‌ని అనుమానించిన పోలీసులు.. ఈ కోణంలో ద‌ర్యాప్తు ప్రారంభించారు. 

ఈ నేపథ్యంలోనే డ్ర‌గ్స్ (మాద‌క ద్ర‌వ్యాలు)కు బానిస అయిన ఓ వ్య‌క్తి అన్సీ, అంజ‌నాలు ప్ర‌యాణిస్తున్న కారును వెంబ‌డించ‌డంతో వారి నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తాజాగా పోలీసులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ధాన నిందితుడు సిజుగా గుర్తించామ‌ని పోలీసులు తెలిపారు.  ప్ర‌మాదానికి ముందు ఓ హోట‌ల్‌లో జ‌రిగిన పార్టీకి సిజు, వారిద్ద‌రి స్నేహితుల‌తో క‌లిసి హాజ‌ర‌య్యాడు. మోడ‌ల్స్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.  ఈ క్ర‌మంలోనే సిజు.. మోడ‌ల్స్ రాత్రి త‌మ‌తో బ‌స చేసే విధంగా వారికి ఆఫ‌ర్ చేశాడు. 

అయితే, అన్సీ తన స్నేహితుల‌తో క‌లిసి అక్క‌డి నుంచి వ‌చ్చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌ధాన నిందితుడు సుజు, అత‌ని స్నేహితుల‌తో క‌లిసి మోడ‌ల్స్ కారును వెంబ‌డించాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌మాదం చోటుచేసుకుంది. తాజాగా అంజ‌నా సోద‌రుడు మాట్లాడుతూ..  త‌న సోద‌రి ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన వారికి శిక్ష‌ప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. సాక్షాల‌ను నాశ‌నం చేయ‌డానికి చూసిన హోట‌ల్ య‌జ‌మానిపైన కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఇక మోడల్స్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ దర్యాప్తు ను కోరుతుండగా, పోలీసులు నిందితుల కస్టడీని పొడిగించాలని కోరుతున్నారు. ఈ రోజు నిందితుల‌ను కోర్టులో హాజ‌రుప‌ర్చ‌నున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios