Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్నెట్ సస్పెన్షన్.. దేశానికి అప్ర‌తిష్ట !

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన ప‌లు చ‌ట్టాలు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. అలాగే, అధికారాలు సైతం దుర్వినియోగం చేయ‌బ‌డుతున్నాయ‌ని ఇదివ‌ర‌కే ప‌లు స‌ర్వేలు పేర్కొన్నాయి. తాజాగా పార్ల‌మెంట‌రీ ప్యానెల్ నివేదిక సైతం ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌ను నియంత్రించే నియ‌మాల దుర్వినియోగంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.
 

Internet suspension rules grossly misused
Author
Hyderabad, First Published Dec 2, 2021, 5:23 PM IST
  • నిబంధనలు దుర్వినియోగ‌మ‌వుతున్న‌య్ ! 
  •  భారీ ఆర్థిక న‌ష్టాన్ని సైతం క‌లిగిస్తున్నాయి
  •  ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ విధించేందుకు న్యాయ‌మైన పార‌మీట‌ర్లు అవ‌స‌రం
  •  ఐటీ పార్లమెంట్ ప్యానెల్ నివేదిక వివ‌రాలు

భారతదేశంలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లను నియంత్రించే నియమాలు "తీవ్రంగా దుర్వినియోగం" చేయబడ్డాయి.  ఇది భారీ ఆర్థిక నష్టానికి దారితీసింది. వినియోగ‌దారుల‌తో పాటు ప్ర‌జానీకానికి సైతం వ‌ర్ణించ‌లేని విధంగా బాధ‌ల‌ను మిగిల్చింది. మ‌రీ ముఖ్యంగా అంత‌ర్జాతీయంగా దేశ ప్ర‌తిష్ట‌కు తీవ్ర‌మైన న‌ష్టాన్ని క‌లిగించింది. మొత్తంగా ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ నియ‌మాల విష‌యంలో అధికార దుర్వినియోగం దేశంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతున్న‌ద‌ని కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పార్లమెంటరీ ప్యానెల్ (parliamentary panel) నివేదిక పేర్కొంది. టెలికామ్ లేదా ఇంటర్నెట్ షట్ డౌన్ ల యొక్క యోగ్యత లేదా సముచితతపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల‌ని communications and information technology (IT) పార్ల‌మెంట‌రీ ప్యానెల్ సిఫారసు చేసింది. 

Also Read: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో స్కూల్స్ బంద్.. ప‌రీక్ష‌ల్లేవ్‌.. ఎందుకంటే?

తాజ‌గా కమ్యూనికేషన్స్ అండ్ ఐటీపై స్టాండింగ్ కమిటీ టెలికామ్ సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సర్వీస్) రూల్స్-2017 తాత్కాలిక సస్పెన్షన్  పై ఓ నివేదికను సమర్పించింది.  పార్ల‌మెంట‌రీ క‌మిటీ స‌మ‌ర్పించిన నివేదిక వివ‌రాలు ఇలావున్నాయి.. 'టెలికాం సర్వీసెస్/ఇంటర్నెట్  సస్పెన్షన్ దాని ప్రభావం' అనే శీర్షికతో పార్ల‌మెంట‌రీ క‌మిటీ ఈ నివేదిక‌ను స‌మ‌ర్పించింది. డిజిటలైజేషన్, ఆర్థిక ప‌రిస్థితులు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఇంట‌ర్నెట్ లేదా టెలికామ్ సేవ‌ల‌ను షట్‌డౌన్‌ చేయ‌వ‌ద్ద‌ని నివేదిక పేర్కొంది. ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌పైనా, ప్ర‌జ‌ల‌పైనా ప్ర‌భావం ప‌డుతున్న‌ద‌ని తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్.. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను ఉటంకిస్తూ,  టెలికామ్ ఆపరేటర్లు షట్ డౌన్ లేదా థ్రోట్లింగ్ ఉన్న ప్రతి సర్కిల్ ప్రాంతంలో గంటకు రూ.24.5 మిలియన్ (2.45 కోట్లు) నష్టపోతున్నార‌ని తెలిపారు. "ఇంటర్నెట్‌పై ఆధారపడే ఇతర వ్యాపారాలు పైన పేర్కొన్న మొత్తంలో 50 శాతం వరకు కోల్పోతాయి" అని నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ షట్‌డౌన్‌లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందననీ, తద్వారా ఈ చ‌ర్య‌లు అధిక జ‌నాభాకు ప్రతికూలంగా ఉపయోగించబడకుండా చూడాలని ప్యానెల్ తన నివేదికలో పేర్కొంది.

Also Read: దేశంలోనే అతిపెద్ద సైబ‌ర్ మోసం.. వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

Internet suspension rules grossly misused

ఇక 2020-జ‌న‌వ‌రిలో జ‌మ్మూకాశ్మీర్‌లో టెలికామ్ కమ్యూనికేషన్‌ల నిలిపివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి.  ఏదైనా నిరవధిక సస్పెన్షన్ సాధారణ న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుందని ఆదేశాలు ఉన్నాయి,
అలాగే, టెలికామ్ కమ్యూనికేషన్‌ల సస్పెన్షన్‌కు సంబంధించిన వివరణాత్మక కారణాలను ప్రభుత్వం అందించాల్సి వుంటుంది. తద్వారా బాధిత వ్యక్తులు కోర్టులో వారిని సవాలు చేయవచ్చు. దీనిని అనుసరించి, జారీ చేయబడిన ఏదైనా సస్పెన్షన్ ఆర్డర్ 15 రోజుల కంటే ఎక్కువ కాలం పనిచేయకూడదని ఆదేశిస్తూ  2020-న‌వంబ‌ర్‌లో సవరించబడ్డాయి. మొత్తంగా టెలికామ్ కమ్యూనికేషన్‌ల స‌స్పెన్ష‌న్  ఆర్డ‌ర్లు  దామాషా సూత్రానికి కట్టుబడి ఉండాల‌ని నిబంధ‌న‌లు స్పష్టంగా పేర్కొంటున్నాయి.  అయితే, టెలికామ్ కమ్యూనికేషన్ ల ష‌ట్‌డౌన్‌ల‌కు సంబంధించి వివ‌రాలు, జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన రికార్డులు లేవు. ప‌లు నిబంధ‌న‌లు సైతం అస్ప‌ష్టంగా ఉన్నాయి.

Also Read: మాజీ మిస్ కేర‌ళ మృతి కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి...

 బీహార్‌, జ‌మ్మూకాశ్మీర్ స‌హా అనేక రాష్ట్రాలు 2019-20లో ప‌లుమార్లు ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌ను కొన‌సాగించాయ‌ని పార్ల‌మెంట‌రీ ప్యానెల్ పేర్కొంది. దీనికి సంబంధించి కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) గానీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వ‌ద్ద‌గాని ఇంటర్నెట్ షట్‌డౌన్ ఆర్డర్‌ల రికార్డులు లేవు. వాటిని ఇవి నిర్వహించ‌లేదు. రాష్ట్రాలు ఎన్ని ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు విధించాయో తమకు తెలియదని DoT మరియు MHA అధికారులు ప్యానెల్‌కు తెలిపారు. ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ విధించేందుకు న్యాయ‌మైన పార‌మీట‌ర్లు సైతం నిర్ధేశించ‌బ‌డ‌లేదు. దీని వ‌ల్ల కార్య‌నిర్వాహ‌క నిర్ణ‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటాయి. దీని వ‌ల్ల అధికార దుర్వినియోగం అధిక‌మ‌వుతోంది అని పార్ల‌మెంట‌రీ ప్యానెల్ పేర్కొంది. అలాగే, జమ్మూ కాశ్మీర్‌లో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్లపై ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: మ‌మ‌తా బెన‌ర్జీకి కాంగ్రెస్ కౌంట‌ర్‌.. ఆమెకు పిచ్చిముదిరిందంటూ..

Follow Us:
Download App:
  • android
  • ios