Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ ఆకట్టుకునేలా ఉంది- ఎన్ సీ నేత ఒమర్ అబ్దుల్లా.. పార్టీ హాజరుకాకపోయినా ప్రశంసించిన కాశ్మీరీ నేత

పార్లమెంట్ కొత్త భవనం చాలా ఆకట్టుకునేలా ఉందని కాశ్మీరీ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కొనియాడారు. గతంలో పార్లమెంట్ సభ్యుల మధ్య కొత్త భవనానికి సంబంధించిన చర్చ వచ్చేదని తెలిపారు. 

Parliament is impressive - NC leader Omar Abdullah.. A Kashmiri leader who was praised even if the party was not present..ISR
Author
First Published May 27, 2023, 2:05 PM IST

పార్లమెంటు కొత్త భవనంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు కురిపించారు. పార్లమెంటు భవనం చాలా ఆకట్టుకునేలా ఉందని అన్నారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి ఆయన పార్టీ హాజరుకాదని ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఈ విధంగా స్పందించడం గమనార్హం. 

హత్యకు గురైన బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు భార్య ఉద్యోగం తొలగించిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం..

ఐకానిక్ భవనం ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫీచర్లను ప్రదర్శించే వీడియోను ప్రధాని మోదీ షేర్ శుక్రవారం చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న 20 ప్రతిపక్ష పార్టీల్లో ఒకటైన నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన నేత ఒమర్ అబ్దుబ్లా ఈ వీడియో క్లిప్ పై స్పందిస్తూ.. ‘‘ప్రారంభోత్సవం గురించి ఒక్క క్షణం ఊహాగానాలను పక్కన పెడితే, ఈ భవనం స్వాగతించదగినది' అని వ్యాఖ్యానించారు.

‘‘పాత పార్లమెంటు భవనం మాకు బాగా ఉపయోగపడింది. కానీ కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేసిన వ్యక్తిగా.. కొత్త, మెరుగైన పార్లమెంటు భవనం ఆవశ్యకత ఉందని మేము తరుచుగా మాట్లాడుకునేవాళ్లం. ఈ కొత్త పార్లమెంట్ భవనం ఇది చాలా ఆకట్టుకునేలా ఉంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ప్రధాని మోడీకి 'సెంగోల్' అప్పగించడం అంటే.. దైవానుగ్రహంతో పట్టాభిషేకం చేసినట్టే - సీపీఎం నేత సీతారాం ఏచూరి

కాగా..  ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. సుమారు 65,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో ఉన్న ఈ కొత్త కాంప్లెక్స్.. ఈ భవనానికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అనే మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.  ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 25 రాజకీయ పార్టీలు హాజరుకానుండగా, కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాయి.  ధాని, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ప్రధాని దేవెగౌడ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తదితరుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios