పాకిస్థాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ప్ర‌తీకారంగా భార‌త్‌పై దాడుల‌కు దిగుతోంది. ఇందులో భాగంగానే జ‌మ్ముపై దాడి చేసింది.   

రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో భారత భద్రతా బలగాలు ఓ పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసి, ఆ విమానానికి చెందిన పైలట్‌ను సజీవంగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.

భారత గగనతలాన్ని దాటి దాడికి యత్నించిన పాక్ యుద్ధ విమానం, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన భారత వాయుసేన, ప్రతిస్పందనగా యుద్ధ విమానాన్ని ఛేదించింది. ఈ క్రమంలో ఆ విమానం భారత భూభాగంలోని జైసల్మేర్ ప్రాంతంలో కూలిపోయింది.

విమానంలోని పైలట్ సజీవంగా పట్టుబడటం పాక్‌కు పెద్ద దెబ్బగా మారనుంది. భారత్ ఇప్పటికే పైలట్‌ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అతడి వద్ద నుంచి పలు కీలక సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.