పాకిస్థాన్ బరితెగిస్తోంది. ఉగ్రవాదులను టార్గెట్ చేసి భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ని చేపడితే పాక్ మాత్రం సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం జమ్ములోని పలు చోట్ల రాకెట్లతో దాడి చేసింది. 

పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది.  సరిహద్దు గ్రామాలపై కాల్పులు కొనసాగిస్తూ వ‌చ్చిన పాక్ ఆర్మీ ఈసారి మ‌రింత తెగించింది. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత సైన్యం వెంటనే చర్యలు చేపట్టి, పాకిస్థాన్‌ తరఫు నుంచి వచ్చిన డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. జమ్మూ నగరంలో అధికారులు బ్లాక్‌అవుట్ ప్రకటించారు. భద్రతా కారణాలతో ప్రజలను ఇళ్లలోనే ఉండాలని సూచించారు. సైన్యం సైరన్ మోగించి హెచ్చరికలు జారీ చేసింది. 

Scroll to load tweet…

ఇటీవల భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్ ఉన్మాదంగా ప్రతిదాడులకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే భారత సైన్యం చురుకుగా స్పందిస్తూ ప్రతి దాడిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. భార‌త ఆర్మీ ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై దాడులు చేస్తే, పాక్ మాత్రం సామాన్య ప్ర‌జ‌ల‌ను టార్గెట్ చేస్తోంది