Asianet News TeluguAsianet News Telugu

మన సైనికులు ధైర్యవంతులు.. కానీ చైనాకు తగిన సమాధానం ఇవ్వాలి.. అది కూడా మన కర్తవ్యమే - కేజ్రీవాల్

ఇండియన్ ఆర్మీ సైనికులు ధైర్యవంతులని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మన డబ్బుతో చైనాను సంపన్న దేశంగా మారుస్తున్నామని అన్నారు. ఇండియాలోనే అనేక వస్తువులు తయారు చేయవచ్చని, దీని వల్ల ఇక్కడి యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. 

Our soldiers are brave.. but we have to give befitting reply to China.. that is also our duty - Kejriwal
Author
First Published Jan 25, 2023, 4:30 PM IST

మన సైనికులు ధైర్యవంతులనీ, అయితే చైనాకు తగిన సమాధానం చెప్పడం కూడా మన కర్తవ్యమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ.. మనం చైనాను సంపన్నులుగా మారుస్తున్నామని, మన డబ్బుతో ఆయుధాలు కొని వారు మనపైనే దాడులు చేస్తున్నారని అన్నారు. మనం షూలు, చెప్పులు, విగ్రహాలు, పరుపులు, దిండ్లు, బొమ్మలు వంటి వస్తువులు కొనుగోలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ వస్తువులన్నీ భారతదేశంలో కూడా తయారు చేయవచ్చని అన్నారు. వీటిని ఇక్కడే తయారు చేస్తే ఉపాధి కూడా పెరుగుతుందని, కోట్లాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. చైనా పెద్ద గుణపాఠం నేర్చుకుంటుందని తెలిపారు.

జామియా వర్సిటీలో బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్!.. అదుపులోకి నలుగురు విద్యార్థి నాయకులు

‘ఈరోజు మనం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనా మనవైపు కన్నేసింది’ కేజ్రీవాల్ అన్నారు. పత్రికలో వచ్చిన కథనాన్ని ఉదాహరణగా పేర్కొంటూ.. మన దేశంలోని కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించుకుందని ఆయన ఆరోపించారు. సరిహద్దుల్లో మన సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉందన్నారు. చైనాను బహిష్కరించి, దానితో వాణిజ్యాన్ని నిలిపివేయడం మన కర్తవ్యమని చెప్పారు.

అజిత్ ‘తెగింపు’ స్టైల్‌లో చోరీకి యత్నం.. బ్యాంక్‌లో పెప్పర్ స్ప్రేతో స్కెచ్, చివరికి

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఏదో చీకటి నీడ కప్పినట్లు కనిపిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. ద్రవ్యోల్బణంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ ఓ నివేదిక ప్రకారం ఢిల్లీలో ద్రవ్యోల్బణం రేటు అత్యల్పంగా ఉందన్నారు. చౌకైన వస్తువులు ఢిల్లీలో ఉన్నాయని ఆయన అన్నారు. ‘‘ఢిల్లీలో కరెంటు, నీరు ఉచితం. ఢిల్లీలో అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో విద్య ఉచితం. ఆసుపత్రిలో చికిత్స ఉచితం. రేషన్ ఉచితం.. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. అందుకే ఢిల్లీలో ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఉంది’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

తన ప్రసంగంలో జీఎస్టీని కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావించారు. కొన్ని ఆహార పదార్థాలపై జీఎస్టీని విధించారని, దీంతో అవి ఖరీదైనవిగా మారాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ వస్తువుల నుంచి జీఎస్టీని తొలగించి దేశ ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. జీఎస్టీని చాలా సంక్లిష్టంగా మార్చారని, దాని వల్ల చాలా మంది వ్యాపారులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.

గోద్రా అనంతర అల్లర్ల కేసు.. సాక్ష్యాలు లేకపోవడంతో 22 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చిన గుజరాత్ కోర్టు..

కాగా.. ఢిల్లీలో ఆధిపత్య అంశంపై ఎన్నికైన ప్రభుత్వానికి, రాజ్యాంగ అధిపతికి మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మంగళవారం ఎల్జీ హౌస్లో సంప్రదాయ 'ఎట్ హోమ్'లో సమావేశమయ్యారు. 2023 జనవరి 26న 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన సతీమణి సంగీతా సక్సేనా రాజ్ నివాస్ లో సంప్రదాయ 'ఎట్ హోమ్'కు ఆతిథ్యం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios