Asianet News TeluguAsianet News Telugu

జామియా వర్సిటీలో బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్!.. అదుపులోకి నలుగురు విద్యార్థి నాయకులు

జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్సిటీలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీబీసీ డాక్యు సిరీస్‌ను స్క్రీనింగ్ చేస్తామని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్లు పిలుపు ఇచ్చారు. దీంతో వర్సిటీ యాజమాన్యం క్యాంపస్‌లో ఎలాంటి గ్యాదరింగ్‌ను అనుమతించబోమని ఆదేశించింది.
 

four students detained over a plan to screen bbc documentary in jamia university
Author
First Published Jan 25, 2023, 4:07 PM IST

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. ఈ డాక్యుమెంటరీ వీడియోలు, లింక్‌లను తొలగించాలని కేంద్రప్రభుత్వం ఇది వరకే సోషల్ మీడియా సైట్ ట్విట్టర్, యూట్యూబ్‌లను ఆదేశించింది. ఇది ఒక ప్రాపగాండ పీస్ అని కొట్టిపారేసింది. అయినప్పటికీ, ఈ డాక్యుమెంటరీని కొన్ని యూనివర్సిటీల విద్యార్థులు స్క్రీనింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ యూనివర్సిటీ, ఢిల్లీలోని జేఎన్‌యూలో ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ కోసం ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలోనూ ఇవే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఇండియా: ది మోడీ కొశ్చన్ అనే రెండు పార్టుల డాక్యు సిరీస్‌ను స్క్రీన్ చేస్తామని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్లు పిలుపు ఇచ్చారు.

యూనివర్సిటీలో ఎలాంటి గ్యాదరింగ్స్ ఉండరాదని, ఎక్కడ గుమిగూడాలన్న ముందస్తు అనుమతి తీసుకోవాలని వర్సిటీ యాజమాన్యం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. లాన్‌లలో, గేట్ల వద్ద స్టూడెంట్లు గుమిగూడరాదనీ ఆదేశించింది. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా బీబీసీ డాక్యుసిరీస్‌ను స్క్రీనింగ్ చేస్తామనే స్టూడెంట్ లీడర్లు నిర్ణయించుకున్నారు.

ఈ డాక్యుమెంట్‌ను స్క్రీనింగ్ చేస్తామన్న స్టూడెంట్ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజీజ్ (జామియా స్టూడెంట్, ఎస్ఎఫ్ఐ జామియా యూనిట్ సెక్రెటరీ), నైవేద్య (జామియా స్టూడెంట్, ఎస్ఎఫ్ఐ దక్షిణ ఢిల్లీ ఏరియా ఉపాధ్యక్షులు), అభిరామ్, తేజ (జామియా విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్లు)లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీబీసీ డాక్యుమెంట్ స్క్రీన్ చేస్తామని పిలుపు ఇచ్చిన ఇద్దరు విద్యార్థులు ఇందులో ఉన్నారు. అజీజ్‌ను ఢిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Also Read: బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం.. జేఎన్ యూలో రాళ్ల దాడి.. కరెంట్, ఇంటర్నెట్ నిలిపివేత..

ఈ డాక్యుమెంటరీ నేపథ్యంలోనే పోలీసులు, బ్లూ రయట్ గేర్, వ్యాన్‌లు, టియర్ గ్యాస్ కెనాన్‌లను మోహరించారు. యూనివర్సిటీ చుట్టూ బలగాలు మోహరించాయి.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ విషయమై ఘర్షణలు జరిగాయి. స్క్రీనింగ్ జరుగుతున్న సమయంలో ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేకుండా పోయాయి. అంతా చీకటి అయిన సమయంలో ఘర్షణలు జరిగాయి. చీకటిలోనూ కొందరు విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో డాక్యుమెంటరీ చూసే పనిలో పడ్డారు. డాక్యుమెంటరీ స్క్రీన్ చేస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జేఎన్‌యూ యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ స్క్రీనింగ్ వైపే విద్యార్థులు మొగ్గారు. ఆ సమయంలో కొందరు తమ పై రాళ్లు విసిరేశారని నిరసనలు చేస్తూ పోలీసు స్టేషన్ ‌లో ఫిర్యాదు ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios