గోద్రా అనంతర అల్లర్ల కేసు.. సాక్ష్యాలు లేకపోవడంతో 22 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చిన గుజరాత్ కోర్టు..
గోద్రా అల్లర్ల అనంతరం గుజరాత్ లోని ఓ గ్రామంలో చెలరేగిన హింసలో ఇద్దరు పిల్లలతో పాటు మైనారిటీ వర్గానికి చెందిన 17 మంది హత్య కేసులో నిందితులుగా ఉన్న 22 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో సాక్ష్యాలు లేకపోవడంతో వారిని నిర్దోషులు అని తేల్చింది.

ఇద్దరు పిల్లలతో పాటు మైనారిటీ వర్గానికి చెందిన 17 మంది హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న 22 మందిని గుజరాత్ పంచమహల్ జిల్లా హలోల్ పట్టణంలోని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2002 గోద్రా అనంతర మత అల్లర్లకు సంబంధించిన కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారందరినీ కోర్టు నిర్దోషులని కోర్టు తేల్చింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. బాధితులంతా 2002 ఫిబ్రవరి 28వ తేదీన హత్యకు గురయ్యారు. అయితే నిందితులు సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో వారి మృతదేహాలను కాల్చేశారు.
ఈ కేసుపై డిఫెన్స్ లాయర్ గోపాల్ సింగ్ సోలంకి మాట్లాడుతూ.. అదనపు సెషన్స్ జడ్జి హర్ష్ త్రివేది జిల్లాలోని డెలోల్ గ్రామంలో మైనారిటీ వర్గాలకు చెందిన ఇద్దరు పిల్లలతో పాటు 17 మందిని హత్య చేసిన కేసులో సాక్ష్యాధారాలు లేనందున నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించారని తెలిపారు. వారిలో 8 మంది కేసు విచారణ ఉన్న సమయంలో మరణించారని చెప్పారు.
గుజరాత్ రాష్ట్రంలోని పంచమహల్ జిల్లా గోద్రా పట్టణం సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ బోగీని ఓ గుంపు తగలబెట్టడంతో 59 మంది ప్రయాణికులను చనిపోయారు. ఈ ఘటనలో ఎక్కువ మంది కరసేవకులే ఉన్నారు. వీరంతా అయోధ్యకు వెళ్లి తిరిగి వస్తున్నారు. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న ఒక రోజు తరువాత 2002 ఫిబ్రవరి 27వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలోనే డెలోల్ గ్రామంలో కూడా హింస జరిగింది. పలువురు హత్యకు గురయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం : నిందితుల బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. ఫిబ్రవరి 9న తుది తీర్పు
అయితే ఈ గ్రామంలో చోటు చేసుకున్న హత్యలు, అల్లర్లకు సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఈ ఘటన జరిగిన రెండేళ్ల తరువాత మరో పోలీసు ఇన్‌స్పెక్టర్ మరో తాజా కేసు నమోదు చేశారు. అల్లర్లకు పాల్పడినందుకు 22 మందిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులోనే ఉంది.
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఎలక్ట్రానిక్ కంపెనీలో చెలరేగుతున్న మంటలు..
నిందితులకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాలను సేకరించలేకపోయిందని డిఫెన్స్ న్యాయవాది సోలంకి తెలిపారు. మృతదేహాలు ఎప్పటికీ లభించలేదని ఆయన చెప్పారు. నది ఒడ్డున నిర్జన ప్రదేశం నుండి పోలీసులు ఎముకలను స్వాధీనం చేసుకున్నారని, అయితే బాధితుల గుర్తింపును నిర్ధారించలేని స్థాయిలో అవి కాలిపోయాయని ఆయన అన్నారు.