Asianet News TeluguAsianet News Telugu

అజిత్ ‘తెగింపు’ స్టైల్‌లో చోరీకి యత్నం.. బ్యాంక్‌లో పెప్పర్ స్ప్రేతో స్కెచ్, చివరికి

తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘తెగింపు’ సినిమా చూసిన ఓ వ్యక్తి అందులో చూపించిన విధంగా బ్యాంక్‌కు కన్నం వేయాలని ప్రయత్నించి చివరికి కటాకటాల పాలయ్యాడు. తాడికొంబులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఈ ఘటన జరిగింది. 

man attempted bank robbery in cinematic style, arrested
Author
First Published Jan 25, 2023, 4:03 PM IST

ఇటీవలికాలంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసి నేరాలకు పాల్పడే కల్చర్ పెరుగుతోంది. నేరాలు ఎలా చేయాలో, వాటి నుంచి ఎలా నేర్పుగా తప్పించుకోవాల్లో సినిమాల్లోనే చూపిస్తున్నారు మేకర్స్. వీటిని ఆసరాగా చేసుకుని నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇక ఇటీవల సంక్రాంతికి విడుదలైన తమిళ అగ్రనటుడు అజిత్ నటించిన ‘తెగింపు’ సినిమా చూసిన ఓ వ్యక్తి అందులో చూపించిన విధంగా బ్యాంక్‌కు కన్నం వేయాలని ప్రయత్నించి చివరికి కటాకటాల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. తాడికొంబులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోకి ఖలీల్ రెహమాన్ అనే వ్యక్తి కారంపొడి, పెప్పర్ స్ప్రే, కటింగ్ బ్లేడ్, కత్తి తీసుకుని చొరబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో విధుల్లో వున్న ముగ్గురు బ్యాంక్ సిబ్బందిపై పెప్పర్ స్ప్రే చల్లి, వారిని ప్లాస్టిక్ బ్యాగ్‌లతో బంధించాడు. అయితే ఓ ఉద్యోగి ఎలాగో తప్పించుకుని బయటకు పరిగెత్తాడు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్థానికులను అప్రమత్తం చేశాడు. దీంతో అంతా కలిసి బ్యాంక్‌లోకి వెళ్లి ఖలీల్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

ALso REad: కోటి రూపాయల దొంగను పట్టించిన ఖాళీ వాటర్ బాటిల్... ఎలాగో తెలుసా?

విచారణలో అతను చెప్పిన సమాధానం విని పోలీసులే నిర్ఘాంతపోయారు. తనకు ఎలాంటి జీవనాధారం లేకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నానని ఖలీల్ చెప్పాడు.ఈ క్రమంలోనే సినిమాలు చూసి దొంగతనాలు నేర్చుకున్నట్లు తెలిపాడు. దీనిలో భాగంగానే అజిత్ తెగింపులో చూపించిన విధంగా దోపిడీకి ప్లాన్ చేసినట్లు చెప్పాడు. ఇతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. 

Follow Us:
Download App:
  • android
  • ios