Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా రైలు ప్రమాదం : 100 మందికి క్రిటికల్ కేర్ అవసరం - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. క్షతగాత్రుల్లో 100 మందికి క్రిటికల్ కేర్ అవసరం అని, వారి కోసం ఢిల్లీ ఎయిమ్స్ తో పాటు ఇతర హాస్పిటల్స్ నుంచి నిపుణులను తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందిస్తున్నామని తెలిపారు. 

Odisha train accident: 100 need critical care - Union Health Minister Mansukh Mandaviya..ISR
Author
First Published Jun 4, 2023, 1:24 PM IST

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన బాధితులకు అందుతున్న వైద్య సహాయాన్ని పరిశీలించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భువనేశ్వర్ లోని ఎయిమ్స్, కటక్ లోని మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మాండవీయ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంపై సమగ్రంగా చర్చించామని, కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేశామని చెప్పారు.

రామ జన్మభూమి తీర్పును వాయిదా వేయాలని లోపలా, బయట నుంచి ఒత్తిడి వచ్చింది - జస్టిస్ సుధీర్ అగర్వాల్

ఈ ఘోర రైలు ప్రమాదంలో 1000 మందికి పైగా గాయపడ్డారని, వారికి చికిత్స కొనసాగుతోందని మాండవీయ తెలిపారు. 100 మందికి పైగా రోగులకు క్రిటికల్ కేర్ అవసరమని, వారి చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్, లేడీ హార్డింజ్ హాస్పిటల్, ఆర్ఎంఎల్ హాస్పిటల్ కు చెందిన నిపుణులైన వైద్యులు అధునాతన పరికరాలు, మెడిసిన్ తో ఇక్కడికి చేరుకున్నారని తెలిపారు. దీనిపై సమగ్రంగా చర్చించి, కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేశామని తెలిపారు.

ఒడిశా రైలు ప్రమాదం : బాధితుల కోసం జీతంలో కొంత విరాళమివ్వండి - ఎంపీలకు వరణ్ గాంధీ సూచన

సుమారు 2,500 మంది ప్రయాణికులతో వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కోల్ కతాకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, భువనేశ్వర్ కు ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలోని బాలాసోర్ లోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. అతివేగంతో వస్తున్న బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పక్కనే ఉన్న ట్రాక్ పై చెల్లాచెదురుగా పడి ఉన్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. దీంతో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది.

ఈ ప్రమాదంలో 21 బోగీలు పట్టాలు తప్పి తీవ్రంగా దెబ్బతినడంతో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రెండు ప్యాసింజర్ రైళ్లు అతివేగంతో ఉండటం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. శిథిలాలను తరలించేందుకు భారీ క్రేన్లను, కూలిపోయిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్లను ఉపయోగించారు.

టైల్స్ వ్యాపారితో యువతి అక్రమ సంబంధం.. తండ్రి, ప్రియుడు, మరొకరితో కలిసి ఆమె ఏం చేసిందంటే ?

కాగా.. శనివారం మధ్యాహ్నం రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగడంతో 150కి పైగా రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. మరి కొన్నింటిని కొంత సమయం పాటు నిలిపివేశారు. ప్రధాన మార్గంలోకి ప్రవేశించడానికి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు సిగ్నల్ ఇచ్చారని, అయితే దాని ప్రకారం కాకుండా రైలు లూప్ లైన్ లోకి ప్రవేశించి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Follow Us:
Download App:
  • android
  • ios