పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్
నేడు మనకు ఉన్న అతిపెద్ద శత్రువు పాకిస్తాన్ కానే కాదని, చైనానే నెంబర్ వన్ శత్రువు అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనాతో యుద్ధ వాతావరణం గనుక ఏర్పడితే మనకు అమెరికా, రష్యా రెండు దేశాలూ కావాలని అన్నారు. నూతన సాంకేతికత అమెరికాను అందితే.. ఆయుధ సంపత్తి రష్యా నుంచి వస్తుందని వివరించారు.
న్యూఢిల్లీ: కొన్ని నెలలుగా భారత సరిహద్దులో ఘర్షణ పూరిత ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. Pakistanతో సరిహద్దులో ఉగ్రవాదుల బెడద ఉంటే.. Chinaతో Border వద్ద Galwan లోయ ఘర్షణ నుంచి ఇప్పటి వరకు శాంతి నెలకొనలేదు. ఈ తరుణంలో భారత్ ఎల్‌వోసీ, ఎల్‌ఏసీ రెండు చోట్ల అప్రమత్తంగా ఉండి తీరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ Bipin Rawat కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు నంబర్ వన్ శత్రువు పాకిస్తాన్ కాదని అన్నారు. అసలైన Enemy చైనా అని స్పష్టం చేశారు. అలాగే, చైనాతో యుద్ధ వాతావరణం ఏర్పడితే మనకు అమెరికా, రష్యా రెండు దేశాల తోడూ కావాలని అన్నారు. నూతన సాంకేతికత అమెరికా నుంచి అందితే.. ఆర్మీకి కావాల్సిన ఆయుధ సంపత్తి రష్యా నుంచి వస్తుందని వివరించారు.
చైనాతో నెలకొన్న ఉద్రికత్తలపై మాట్లాడుతూ, ముందు సరిహద్దు నుంచి ఉపసంహరణపై ఫోకస్ పెట్టామని, తర్వాతే ఉద్రిక్తతల నివారణ చర్యలు తీసుకుంటామని వివరించారు. 2020 ఏప్రిల్ కంటే ముందు ఉన్న పొజిషన్లకు ఇరుదేశాల బలగాలు వెనక్కి వెళ్లడమే తొలి ప్రాధాన్యత అని అన్నారు. ఒకే సమయంలో సరిహద్దుకు సమాన దూరాల్లో ఇరుదేశాల బలగాలు ఉపసంహరించుకోవాలని తెలిపారు. మొదటి నుంచి సరిహద్దులో చైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉన్నదని, అందుకే ముందు ఉపసంహరణకే ప్రాధాన్యతనిచ్చినట్టు చెప్పారు.
Also Read: భవిష్యత్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో కలుస్తుంది: వైమానిక దళ సీనియర్ అధికారి
ఈశాన్య రాష్ట్రాల్లో చైనా సైనికులు ప్రవేశించారని, అక్కడ ఓ గ్రామాన్నీ నిర్మించారని వస్తున్న వార్తలపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. అది పాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని, ఇప్పుడు దాన్ని పునర్అబివృద్ధి పరుస్తున్నారని చెప్పారు. ఇది బల ప్రదర్శన అని భావించడం లేదని వివరించారు. సరిహద్దుకు చైనా వైపున కొన్ని శాశ్వత నిర్మాణాలనూ గుర్తించామని, ఒకవేళ మనం అక్కడ శాశ్వతంగా ఉండాలనుకున్నా.. ఉండవచ్చు అని తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలను దృష్టిలో పెట్టుకుని హక్కానీ నెట్‌వర్క్ సాయంగా పాకిస్తాన్ ఏమైనా సరిహద్దులో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఉపేక్షించబోమని, ఇది వరకే దాన్ని నిరూపించామని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఇకపైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సమర్థవంతంగా ఎదుర్కొంటామని వివరించారు.
Also Read: సరిహద్దులో భారత ఆర్మీ మిస్సైల్ ఫైరింగ్.. వీడియో ఇదే..!
సరిహద్దులపై చైనా దానికదిగా కొత్త నిబంధనలు రూపొందించుకున్న వార్తలను ప్రస్తావిస్తే అదంతా చైనా సైకలాజికల్ గేమ్ అని, ఆ వలలో పడవద్దని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. మానసికంగా ఒత్తిడి తేవాలనేది వాళ్ల వ్యూహమని, అందులో ఇరుక్కుపోవద్దని చెప్పారు. ఈ రోజు చైనానే మనకు అతిపెద్ద శత్రువు అని, పాకిస్తాన్ కాదని స్పష్టం చేశారు.
జమ్ము కశ్మీర్‌లో పౌరులపై ఉగ్రవాదులు విరుచుకుపడటంతో చాలా మంది పౌరులు మళ్లీ వెనక్కి మళ్లుతున్నారనే వాదనలపైనా మాట్లాడుతూ, ఈ భయంతో కశ్మీర్ లోయను వదిలే వారు లేరని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. టెర్రరిస్టులు కనపడితే తామే వారిని ఎదుర్కొంటామనే మాటలూ వినిపిస్తున్నాయని చెప్పారు. జమ్ము కశ్మీర్ నుంచి పౌరులు వెనక్కి వెళ్లిపోతున్నారనే మాటలు అవాస్తవాలని కొట్టిపారేశారు.