సరిహద్దులో భారత ఆర్మీ మిస్సైల్ ఫైరింగ్.. వీడియో ఇదే..!

చైనాతో సరిహద్దులో భారత ఆర్మీ అప్రమత్తంగా ఉన్నది. ఏ క్షణంలోనైనా శత్రువల కవ్వింపులకు దీటైన సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అప్రమత్తతలో భాగంగానే ఆర్మీ డ్రిల్స్ నిర్వహిస్తున్నది. తాజాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత ఆర్మీ మిస్సైల్ ఫైరింగ్‌పై డెమో నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియో  ఇప్పుడు వైరల్ అవుతున్నది.
 

indian army firing missile in arunchal pradesh in a drill video here

న్యూఢిల్లీ: పాకిస్తాన్, చైనాల నుంచి ఎప్పుడు ఎలాంటి ముప్పు ఎదురవుతున్నదో తెలియని పరిస్థితి. పాకిస్తాన్ నుంచి సరిహద్దు గుండా ఉగ్రవాదులు చొరబడి దేశంలో పేలుళ్లకు పాల్పడుతున్నారు. చైనా సైనికులూ భారత సరిహద్దులోకి దూసుకురావడం, వెనక్కి వెళ్లడం పరిపాటిగా మారుతున్నది. బోర్డర్‌లో తరుచూ కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దులో Indian Army అప్రమత్తతతో వ్యవహరిస్తున్నది. ఎప్పటికప్పుడు ఆయుధాలను సమీకరించుకోవడమే కాదు.. నైపుణ్యాలు, అనువైన ప్రాంతాలకు తరలివెళ్లిపోవడం చేస్తున్నారు. రానున్న శీతాకాలంలోనూ చైనా ఆర్మీకి దీటుగా నిలబడటానికి సమాయత్తమై వెళ్లిపోయారు. ఈ అప్రమత్తతలో భాగంగానే భారత ఆర్మీ drills నిర్వహిస్తుంటుంది. తాజాగా, Arunachal Pradeshలో సరిహద్దు ప్రాంతం తవాంగ్ సెక్టార్‌లో మిస్సైల్ ఫైరింగ్ డ్రిల్ చేపట్టింది. 

సైనికులు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్‌ను ప్రయోగించి లక్ష్యాన్ని ఛేదిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తవాంగ్ సెక్టార్‌లో మంచుదుప్పటి కప్పేయడంతో కిలోమీటర్ల దూరంలోని వస్తువులు మసకగా కనిపిస్తున్నాయి. ఇదే సినారియోను సిమ్యులేట్ చేస్తూ భారత ఆర్మీ అద్భుతంగా మిస్సైల్స్ ప్రయోగించారు. ఆ క్షిపణులు లక్ష్యాలను చేరాయి.

ఈ వీడియోలో ఇద్దరు జవాన్లు వేగంగా ఓ బంకర్‌ను చేరుకుని యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను సెకండ్ల వ్యవధిలోనే ఏర్పాటు చేశారు. వారి వెనుక నుంచే కొందరు అరుస్తూ తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. ఆ ఇన్ఫర్మేషన్‌కు అనుసంధానంలో missileను ప్రయోగించారు. అది టార్గెట్‌ను తాకింది. కొండపై నుంచి పరిశీలిస్తున్నవారు ఎంతమంది చనిపోయారన్నదని చెబుతారని ఓ జవాన్ వివరించారు. ఆ విషయాన్ని కంపెనీ కమాండర్‌కు తెలియజేస్తాడని పేర్కొన్నారు.

Also Read: ఢీ అంటే ఢీ.. అమెరికా సైన్యంతో ఇండియన్ ఆర్మీ కబడ్డీ.. వీడియో ఇదే..

మిస్సైల్ ఫైరింగ్ ముగిసిపోగానే వెంటనే ఆ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను అక్కడి నుంచి తొలగించారు. మరోచోటికి దాన్ని తరలించారు. ఒకసారి మిస్సైల్‌ను ఫైర్ చేయగానే వెంటనే అక్కడి నుంచి తరలి మరో పొజిషన్‌లో యాంటీ ట్యాంగ్ గైడెడ్ మిస్సైల్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆ జవాను తెలిపారు. తద్వార ఫైరింగ్ జరిపిన చోటకు శత్రువుల నుంచి వచ్చే క్షిపణులను తప్పించుకోవచ్చని వివరించారు.

అరుణాల్ ప్రదేశ్‌లోనూ సరిహద్దులో చైనా ఆర్మీ నుంచి ముప్పు ఉన్నది. ఈ నేపథ్యంలోనూ భారత ఆర్మీ చైనాతో సరిహద్దులో మోహరించి ఉన్నది. ఇప్పటికే స్వీడిష్ బోఫోర్స్ గన్నులు, ఎం-777 హోవిట్జర్లున్నాయి. వీటికితోడు అదనంగా ఆధునీకరించిన ఎల్70 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్నులనూ ఆర్మీ సమకూర్చుకున్నదని అధికారులు వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios