Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ గాలి, నీటిలోనే కాదు.. కేజ్రీవాల్ ఉద్దేశంలోనూ కాలుష్యం ఉంది - బీజేపీ

ఢిల్లీ కాలుష్యం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాలుష్యం అనేది ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదని, ఇది ఉత్తర భారతదేశ సమస్య అని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనగా.. ఆయన ఉద్దేశంలోనే కాలుష్యం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి  సంబిత్ పాత్ర ఆరోపించారు. 

Not only in Delhi's air and water..Kejriwal's intention is pollution - BJP
Author
First Published Nov 5, 2022, 5:38 AM IST

ఢిల్లీలో గాలి నాణ్యత వరుసగా రెండో రోజు కూడా ‘తీవ్రమైన’ కేటగిరిలో కొనసాగింది. దీంతో నగర కాలుష్యంపై బీజేపీ ఆప్ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ రాజధాని మొత్తం కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు. కేవలం నగర గాలి, నీటిలోనే కాలుష్యం లేదని, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశలోనూ కాలుష్యం ఉందని ఆరోపించారు. 

మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు ఎమ్మెల్యే అబ్బాస్‌ను అరెస్టు చేసిన ఈడీ.. ఎందుకంటే ?

“కాలుష్యంపై రాజకీయాలు చేయవద్దని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కానీ చాలా కాలంగా వారే రాజకీయాలు చేస్తున్నారు. పంజాబ్‌ పొట్టు తగులబెట్టడం 34 శాతం పెరిగింది. పంట అవశేషాల నిర్వహణ కోసం కేంద్రం రూ. 1,350 కోట్లు ఇచ్చింది. పంజాబ్ ప్రభుత్వం 12000 యంత్రాలను కొనుగోలు చేసింది. కానీ ఆ యంత్రాలకు సంబంధించి ఖాతా లేదు’’ అని ఆయన ఆరోపించారు.

నిర్మాణ రంగంలో ఢిల్లీ కార్మిక మంత్రిత్వ శాఖ భారీ అవినీతికి పాల్పడిందని సంబిత్ పాత్ర ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి అందాల్సిన సొమ్మును ఆప్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం బోగస్ భవన నిర్మాణ కార్మికులను నమోదు చేసి, ఆప్ తన సొంత పనుల కోసం వారికి కేటాయించిన డబ్బును స్వాహా చేసిందని ఆయన ఆరోపించారు. నిర్మాణ పరిశ్రమలకు సంబంధించినంత వరకు తాము మాట్లాడుతున్న విషయాలు భారతదేశ చరిత్రలో అతిపెద్ద అవినీతి కేసు అని అన్నారు. ఢిల్లీ కార్మిక మంత్రిత్వ శాఖ చేసిన అవినీతి దుష్ప్రచారాన్ని బహిర్గతం చేయడానికి తాము ఏ రాయిని వదిలిపెట్టము అని చెప్పారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. 43 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..

భవన నిర్మాణ కార్మికుల కోసం పనిచేస్తున్న మూడు స్వచ్ఛంద సంస్థలు ప్రాక్సీల ద్వారా ఢిల్లీలో రిజిస్ట్రేషన్ లో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. 65,000 మంది కార్మికులకు ఒకే మొబైల్ నంబర్ ఉందని, ఢిల్లీలో 15,700 మందికి ఒకే చిరునామా ఉందని, మిగిలిన 4,370 మందికి అదే శాశ్వత చిరునామా ఉందని పాత్రా తెలిపారు. ఢిల్లీలో రెండు లక్షల మంది నకిలీ భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ అయినట్లు దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. ఇందులో కోట్లాది రూపాయిల కుంభకోణం జరిగిందని అన్నారు. 2006-2021 మధ్య కాలంలో 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఢిల్లీ ప్రభుత్వ కార్మిక శాఖ పరిధిలో రిజిస్టర్ అయ్యారని పాత్రా తెలిపారు. అయితే వీటిలో 2018 నుంచి 2021 మధ్యలోనే 9 లక్షలకు పైగా పేర్లు నమోదయ్యాయని చెప్పారు.

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. ఇండియా మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ టీమ్ సిబ్బందిలో భారీగా కోత

కాగా.. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ కాలుష్యం విషయంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కాలుష్యం ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదని, ఇది ఉత్తర భారతదేశ మొత్తం సమస్య అని అన్నారు. దీనిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానికి ఉందని తెలిపారు. దీనిని రాజకీయం చేయకూడదని కోరారు. “ కాలుష్యం మొత్తం ఉత్తర భారతదేశం సమస్య. దీనిపై రాజకీయాలు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ లో మాత్రమే కాలుష్యం ఉందని చూపిస్తున్నారు. హర్యానా, యూపీ నగరాల్లో కూడా కాలుష్యం ఉంది. మరి దీనిని ప్రధాని పరిష్కరించాలి. ’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios