Asianet News TeluguAsianet News Telugu

మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు ఎమ్మెల్యే అబ్బాస్‌ను అరెస్టు చేసిన ఈడీ.. ఎందుకంటే ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మౌ సదర్‌ నియోజకవర్గం నుంచి ఎస్బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాస్ అన్సారీని ఈడీ దాదాపు 9 గంటల పాటు విచారించింది. అనంతరం ఆయనను మనీలాండరింగ్ కేసులో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసింది. 

ED arrested MLA Abbas, son of mafia don Mukhtar Ansari.
Author
First Published Nov 5, 2022, 3:54 AM IST

మాఫియా డాన్ ముక్తార్ అన్సారీ కుమారుడు ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీని గంటల తరబడి విచారణ అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఆలస్యంగా అరెస్టు చేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్‌లైన్స్‌లోని కార్యాలయంలో దాదాపు 9 గంటల పాటు దర్యాప్తు సంస్థ అతడిని విచారించింది. మనీలాండరింగ్ కేసులో అబ్బాస్‌పై అక్టోబర్ 11న ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అదే కేసులో ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. 43 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..

అబ్బాస్ అన్సారీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో సుమారు తొమ్మిది గంటల పాటు విచారించింది. మాఫియా ముఖ్తార్‌కు చెందిన బినామీ ఆస్తుల విషయంలో ఆయన నుంచి సమాచారం సేకరించారు. దేశం విడిచి వెళ్లిపోతారనే భయంతో ఈడీ ఇప్పటికే అతడికి లుకౌట్ నోటీసు జారీ చేసింది. విచారణ సమయంలో ఆయన ఈడీ వేసిన అన్ని ప్రశ్నలకు రౌండ్ అబౌట్ పద్ధతిలో సమాధానం ఇస్తూనే ఉన్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈడీ అతడిని అరెస్ట్ చేసింది.

కొడుకుతో కలిసి సచిన్ టెండూల్కర్ జాలీ ట్రిప్.. ఖరీదైన కార్లను వదిలి కియా కేరెన్స్ లో ప్రయాణం.. వీడియో వైరల్

ఎమ్మెల్యే అన్సారీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అత్యంత రహస్యంగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బండా జైలులో ఉన్న మాఫియా ముఖ్తార్ అన్సారీపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అబ్బాస్ అన్సారీ ఇక్కడికి చేరుకోగానే సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఈడీ ప్రధాన గేటు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడి  కదలికలపైనా నిషేధం విధించారు. లోపల ఉన్న ఈడీ అధికారులు అబ్బాస్ అన్సారీని ప్రశ్నించడం ప్రారంభించారు.

భారత్ జోడో యాత్ర ... రాహుల్ గాంధీపై కేసు, కేజీఎఫ్ 2 వల్లే

‘‘ ముఖ్తార్ అన్సారీ ఇన్ని బినామీ ఆస్తులను ఎక్కడ నుండి సంపాదించాడు? భూమి, ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? మీరు మాఫియాకు ఎంత దగ్గరగా ఉన్నారు? అతడి సన్నిహిత మిత్రులకు ఎంత ఆస్తి ఉంది?’’ వంటి ప్రశ్నలన్నీ ఎమ్మెల్యే అబ్బాస్ ను ఈడీ అడిగిందని ‘జాగరన్’ నివేదించింది. కానీ అన్ని ప్రశ్నలకు ఆయన రౌండ్అబౌట్‌గా సమాధానం ఇస్తూనే ఉన్నాడు. దాదాపు తొమ్మిది గంటల పాటు అతడిని విచారించిన అనంతరం అరెస్టు చేశారు. 

ముంబయిలోని హాస్పిటల్‌లో 132 ఏళ్ల కిందటి సొరంగం వెలుగులోకి.. ఎలా తెలిసిందంటే?

మౌ సదర్‌ నియోజకవర్గం నుంచి ఎస్బీఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాస్ అన్సారీ దేశం విడిచి పారిపోతారనే భయంతో ఈడీ ఇటీవల లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయనను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. తాజాగా ఈడీ ఎమ్మెల్యే అబ్సాస్ తో పాటు ఆయన డ్రైవర్ రవికుమార్ శర్మను కూడా ఓ ప్రత్యేక గదిలో విచారించారు. 2021 మార్చిలో మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా అబ్సాస్ ను ఈడీ విచారించింది.

Follow Us:
Download App:
  • android
  • ios