Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. 43 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..

గుజరాత్  ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 43 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ జాబితాను విడుదల చేశారు. 

Gujarat Assembly Elections.. Congress has released the first list with 43 candidates..
Author
First Published Nov 5, 2022, 2:19 AM IST

త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని భావిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం తన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో మొదటి జాబితాలోని అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ తొలి జాబితాలో గాంధీనగర్ సౌత్, సూరత్ వెస్ట్, పోర్ బందర్, నడియాడ్, జామ్‌నగర్ నార్త్, రాజ్‌కోట్ రూరల్, రాజ్‌కోట్ సౌత్ పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు 43 మంది అభ్యర్థులను ప్రకటించింది.

కొడుకుతో కలిసి సచిన్ టెండూల్కర్ జాలీ ట్రిప్.. ఖరీదైన కార్లను వదిలి కియా కేరెన్స్ లో ప్రయాణం.. వీడియో వైరల్

బీజేపీ నాయకుడు, సీఎం భూపేంద్ర పటేల్‌ బరిలోకి దిగాలని భావిస్తున్న ఘట్లోడియా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తన రాజ్యసభ ఎంపీ అమీబెన్ యాగ్నిక్‌ను పోటీలో నిలిపింది. పార్టీ సీనియర్ నేత అర్జున్ మోద్వాడియా మరోసారి పోర్ బందర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. భావ్‌నగర్ జిల్లాలోని మహువ స్థానం నుంచి కనుభాయ్ కల్సరియా, గాంధీనగర్ సౌత్ స్థానం నుంచి డాక్టర్ హిమాన్సు పటేల్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది.

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. ఇండియా మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ టీమ్ సిబ్బందిలో భారీగా కోత

గుజరాత్ దశాబ్దాలుగా కాషాయ పార్టీకి కంచుకోటగా ఉంది. గత 22 సంవత్సరాలుగా బీజేపీ రాష్ట్రాన్ని పాలిస్తోంది. అయితే ఈ సారి బీజేపీ నుంచి రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాగా.. బీజేపీకి ఈ సారి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన పోటీ దారుగా కనిపిస్తోంది. ఆయన తన ప్రచారంలో ఉచిత హామీలు, ఢిల్లీ మోడల్ ను పదే పదే ప్రస్తావిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో వరుసగా ఆరుసార్లు బీజేపీ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్.. ఇప్పటికైనా మళ్లీ పూర్వ వైభవం సాధించాలని భావిస్తోంది. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 182 సీట్లలో 77 సీట్లు గెలుచుకుని బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. కాషాయ పార్టీ 99 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఏడాది పంజాబ్‌లో ఆప్ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి రెండు రాష్ట్రాలు మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.

భారత్ జోడో యాత్ర ... రాహుల్ గాంధీపై కేసు, కేజీఎఫ్ 2 వల్లే

గత నెలలో పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ తో, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మొదటివి. 43 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేసే ముందు ఖర్గే సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో సీఈసీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్, మొహసీనా కిద్వాయ్, గిరిజా వ్యాస్, అంబికా సోనీ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) గుజరాత్ ఇన్‌ఛార్జ్ రఘు శర్మ, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ జగదీష్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. కాగా.. 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios