Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. ఇండియా మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ టీమ్ సిబ్బందిలో భారీగా కోత

ప్రపంచ కుబేర వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తరువాత సంస్థ లో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. ట్విట్టర్ కు ఆర్థిక భారంగా మారిన అనేక అంశాలను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఒక్క సారిగా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. 

Twitter gave a shock to the employees. Massive cut in the staff of the India marketing and communications teammarketing
Author
First Published Nov 4, 2022, 11:31 PM IST

ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ఈ విషయం చాలా మంది ఉద్యోగులకు వారి అధికారిక ఇమెయిల్ ఐడీ, ఇంటర్నల్ సిస్టమ్‌లోకి లాగిన్ కాలేకపోవడంతోనే అర్థం అయ్యింది. భారత్ తో సహా అనేక దేశాల్లోని ఈ తొలగింపు ప్రక్రియ జరిగింది. భారతదేశంలో మొత్తం మార్కెటింగ్, కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌ను ట్విట్టర్ తొలగించిందని ‘ఎన్డీటీవీ’ నివేదించింది.

భారత్ జోడో యాత్ర ... రాహుల్ గాంధీపై కేసు, కేజీఎఫ్ 2 వల్లే

ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తరువాత.. ఆ స్థంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి , 44 బిలియన్ల డాలర్ల సముపార్జనను ఆచరణలో పెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల్లో కోత విధించాలని ఆదేశించాడు. ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తయిన వెంటనే మాస్క్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు సీఎఫ్ వో మరి కొందరు ఉన్నతాధికారులను తొలగించి తన ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. 

మస్క్ ఇప్పుడు కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడానికి భారీ కసరత్తును ప్రారంభించారు. ‘‘ లే-ఆఫ్ ప్రారంభమైంది. నా సహోద్యోగులలో కొందరికి దీనికి సంబంధించిన సమాచారం ఇమెయిల్ నోటిఫికేషన్ ద్వారా వచ్చింది ’’ అని ఓ ట్విట్టర్ ఇండియా ఉద్యోగి ఎన్డీటీవీతో తెలిపారు.

ముంబయిలోని హాస్పిటల్‌లో 132 ఏళ్ల కిందటి సొరంగం వెలుగులోకి.. ఎలా తెలిసిందంటే?

కాగా.. ఈ లే-ఆఫ్‌లు ట్విట్టర్ ఇండియా టీమ్ లోని ముఖ్యమైన ముఖ్యమైన భాగాన్ని ప్రభావితం చేశాయి. అయితే ఈ ఉద్యోగాల కోతకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ విషయంలో వార్తా సంస్థ ‘పీటీఐ’ ట్విట్టర్ ఇండియాను సంప్రదించింది. కానీ ఇమెయిల్ ద్వారా పంపింన ప్రశ్నలకు ఆ సంస్థ సమాధానం ఇవ్వలేదని ‘పీటీఐ’ నివేదించింది. 

కాగా.. యూఎస్ బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ట్విట్టర్ అంతకు ముందు ఓ ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో ‘‘ట్విట్టర్‌ను ఆరోగ్యకరమైన మార్గంలో ఉంచే ప్రయత్నంలో భాగంగా మేము శుక్రవారం మా గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించే కష్టమైన ప్రక్రియను అమలు చేస్తున్నాం’’ అని పేర్కొంది. ఇది ‘‘ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత ఇమెయిల్‌ను స్వీకరిస్తారు’’ అని పేర్కొంది.

పంజాబ్‌లో శివసేన లీడర్ సుధీర్ సూరి హత్య.. పట్టపగలే కాల్పులు.. టాప్ పాయింట్స్

ఇదిలా ఉండతా.. ట్విట్టర్ ఆదేశాల ప్రకారం ఉద్యోగుల భద్రతతో పాటు ట్విట్టర్ సిస్టమ్‌లు, కస్టమర్ డేటా కోసం కంపెనీ అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తుంది.  ‘‘ మీరు ఆఫీసులో ఉన్నట్లయితే లేక మీ ఆఫీసుకు వెళ్తున్నట్లయితే దయచేసి ఇంటికి తిరిగి వెళ్లండి ’’ అని ట్విట్టర్ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios