Asianet News TeluguAsianet News Telugu

ఎంపీగా కాదు.. మహిళగా చెబుతున్నా.. రెజ్లర్లకు న్యాయం చేయండి - బీజేపీ నేత ప్రీతమ్ ముండే

రెజ్లర్లకు న్యాయం చేయాలని బీజేపీ నేత, ఎంపీ ప్రీతమ్ ముండే కోరారు. తాను ఓ ఎంపీగా ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, ఓ మహిళగా మాట్లాడుతున్నానని అన్నారు. రెజ్లర్లపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో దాన్ని స్వాగతించలేమని తెలిపారు. 

Not as an MP, but as a woman, do justice to the wrestlers - BJP leader Pritam Munde..ISR
Author
First Published Jun 3, 2023, 11:24 AM IST

లైంగిక వేధింపుల ఆరోపణలపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే డిమాండ్ చేశారు. రెజ్లర్లకు న్యాయం చేయాలని కోరారు. తాను ఓ ఎంపీగా ఈ విధంగా మాట్లాడటం లేదని, ఓ మహిళగా చెబుతున్నానని అన్నారు. ఫిర్యాదు సరైనదా కాదా అనేది అధికారులు తర్వాత నిర్ణయించవచ్చని ముండే చెప్పారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుత కేసులో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

అమిత్ షా విజ్ఞప్తికి భారీ స్పందన.. మణిపూర్ లో 140కి పైగా ఆయుధాలు సరెండర్..

‘‘నేను ఓ పార్లమెంటు సభ్యురాలిగా కాదు..ఓ మహిళా మాట్లాడుతున్నాను. ఒక మహిళగా ఎవరైనా మహిళ నుంచి ఇలాంటి ఫిర్యాదు వస్తే పరిగణనలోకి తీసుకోవాలి. తరువాత దానిని ధ్రువీకరించుకోవాలి. వెరిఫికేషన్ తర్వాత అది సబబేనా, అసమంజసమా అనేది అధికారులు తేల్చుకోవాలి’’ అని ప్రీతమ్ ఉండే అన్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో దాన్ని స్వాగతించలేమని చెప్పారు. ఈ కేసు విచారణ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోందని తెలిపారు. ఇప్పుడు నేను విచారణ కమిటీని డిమాండ్ చేస్తే అది పబ్లిసిటీ స్టంట్ అవుతుందని చెప్పారు. ఈ కేసులో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాని అన్నారు.

గోల్డెన్ టెంపుల్ వద్ద భద్రత కట్టుదిట్టం.. ఎందుకంటే ?

కాగా.. రెజ్లర్లు ఆరోపణలు చేస్తున్న వ్యక్తి బీజేపీకి చెందిన నేత కావడంతో ఈ విషయంలో ఆ పార్టీకి చెందిన నాయకులెవరూ మాట్లాడటం లేదు. అయితే అతి కొద్ది మంది బీజేపీ నాయకులు మాత్రమే ఈ విషయంపై వ్యాఖ్యానించారు. అందులో ఇప్పుడు ప్రీతమ్ ముండే కూడా అందులో చేరారు. 

హిజాబ్ వివాదం.. గంగా-జమునా పాఠశాల గుర్తింపును రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఇదిలా ఉండగా.. మైనర్ సహా పలువురు మహిళా రెజ్లర్లను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగికంగా వేధించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని గత కొంత కాలంగా సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా, సంగీతా ఫోగట్ సహా ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలు సాధించిన క్రీడాకారులు న్యూఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. రెజ్లర్లు ఇటీవల తమ పతకాలను గంగానదిలో నిమజ్జనం చేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం సహనంతో ఉండాలని, సుప్రీంకోర్టు, క్రీడా మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులపై నమ్మకం ఉంచాలని కోరారు. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన కేసులు ఇంకా పరిశీలనలో ఉన్నాయని, స్టేటస్ రిపోర్టులను కోర్టుకు సమర్పిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నివేదికను కోర్టుకు సమర్పించే ముందు ఏదైనా చెప్పడం పద్ధతికి విరుద్ధమని ఈ కేసుపై మూడు ట్వీట్లను డిలీట్ చేసిన పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios