Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షా విజ్ఞప్తికి భారీ స్పందన.. మణిపూర్ లో 140కి పైగా ఆయుధాలు సరెండర్..

ఆయుధాలు విడిచిపెట్టాలని మణిపూర్ వాసులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన విజ్ఞప్తికి స్పందన లభించింది. ఇప్పటి వరకు 140కి పైగా ఆయుధాలను ప్రజలు అధికారులకు అప్పగించారు. 

Huge response to Amit Shah's appeal.. More than 140 weapons surrendered in Manipur..ISR
Author
First Published Jun 3, 2023, 9:45 AM IST

మణిపూర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తికి భారీ స్పందన లభించింది. హింసాత్మక ఘటనలతో అతలాకుతలమైన ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 140కి పైగా ఆయుధాలు సరెండర్ చేశారు. ఈ ఆయుధాల్లో సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, కార్బైన్, ఏకే, ఇన్సాస్ రైఫిల్స్, లైట్ మెషిన్ గన్స్, పిస్తోళ్లు, ఎం16 రైఫిల్స్, స్మోక్ గన్/టియర్ గ్యాస్, స్టెన్ గన్, గ్రెనేడ్ లాంచర్ ఉన్నాయి. 

గోల్డెన్ టెంపుల్ వద్ద భద్రత కట్టుదిట్టం.. ఎందుకంటే ?

మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ఆ రాష్ట్రంలోనే ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తమ ఆయుధాలను భద్రతా దళాలకు, అధికార యంత్రాంగానికి అప్పగించాలని విజ్ఞప్తి గురువారం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో సెర్చ్ అండ్ కూంబింగ్ చేపడతామని, ఎవరైనా ఆయుధాలు కలిగి ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు. మణిపూర్ లో చాలా జిల్లాల్లో పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉందని, వివిధ భద్రతా సంస్థలు సమన్వయంతో కృషి చేయడంతో ఇది సాధ్యమైందని అన్నారు. 

మణిపూర్ లోని అన్ని భద్రతా సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఇంటర్ ఏజెన్సీ యూనిఫైడ్ కమాండ్ ను ఏర్పాటు చేస్తామని, బహుళ బలగాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని హోం మంత్రి చెప్పారు. ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మిలిటెంట్ గ్రూపులను హెచ్చరించారు. సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందం నుంచి వైదొలగితే తాము సంతకం చేసిన ఒప్పందాల ఉల్లంఘనగా పరిగణిస్తామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఎన్నికల హామీలపై సిద్ధరామయ్య కేబినెట్ కీలక నిర్ణయం..

షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మీటీ కమ్యూనిటీ చేస్తున్న డిమాండ్ ను నిరసిస్తూ మే 3వ తేదీన మణిపూర్ లోని కొండ జిల్లాల్లో ‘‘ట్రైబల్ సాలిడారిటీ మార్చ్’’ నిర్వహించిన తరువాత జాతి ఘర్షణలు చెలరేగాయి. దీనిని నియంత్రించడానికి భద్రతా దళాలు ప్రయత్నించాయి. అయితే గత ఆదివారం మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు, ఎదురుకాల్పులు పెరిగాయి. ఈ హింసాకాండలో 80 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.

హిజాబ్ వివాదం.. గంగా-జమునా పాఠశాల గుర్తింపును రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

కాగా.. కమ్యూనిటీ హాళ్లు సహా 272 సహాయ శిబిరాల్లో శుక్రవారం ఉదయం నాటికి 37,450 మంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో 807 మందితో 10, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో 7,183 మందితో 39, 1,408 మందితో తౌబాల్ 12, 8,031 మందితో బిష్ణుపూర్ 58, రాచంద్ పూర్ లో 8,929 మందితో 63 శిబిరాలు ఉన్నాయి. అలాగే తెంగ్నూపాల్ జిల్లాలో 884 మందితో 9 శిబిరాలు, కక్చింగ్ 14 శిబిరాల్లో 992 మంది, జిరిబామ్ 3 శిబిరాల్లో 115 మంది, కాంగ్పోక్పిలో 54 క్యాంపుల్లో 8,000 మంది, ఉఖ్రుల్ ఒక క్యాంపులో 35 మంది, సేనాపతి రెండు శిబిరాల్లో 552 మంది, కామ్జోంగ్ లో 364 మందితో, చందేల్ రెండు శిబిరాల్లో 150 మంది ఆశ్రయం పొందుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios