Asianet News TeluguAsianet News Telugu

గోల్డెన్ టెంపుల్ వద్ద భద్రత కట్టుదిట్టం.. ఎందుకంటే ?

గత నెలలో పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ వద్ద మూడు బాంబు పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ఆ ఆలయ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులను తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతి ఇస్తున్నారు. 

Security is tight at the Golden Temple.. because?..ISR
Author
First Published Jun 3, 2023, 8:43 AM IST

పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల మూడు పేలుళ్లు సంభవించాయి. ఇవి తక్కువ తీవ్రతతోనే ఉన్నప్పటికీ భద్రతాపరమైన భయాందోళనలు రేకెత్తిచ్చాయి. ఈ నేథ్యంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) ఆధ్వర్యంలో కాంప్లెక్స్, హెరిటేజ్ స్ట్రీట్ చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గల్లియారా వద్ద 50 హై రిజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు, సందర్శకుల భద్రత కోసం అన్ని ప్రవేశ ద్వారాల వద్ద స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు.

ఒడిశా రైలు ప్రమాదం.. నేడు సంతాప దినంగా ప్రకటించిన నవీన్ పట్నాయక్

మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించారు. వీటితో పాటు ఆలయ ప్రాముఖ్యత, కాంప్లెక్స్ లో పాటించాల్సిన మర్యాదలు (సిద్ధాంతాలు) తో పాటు పలు భాషల్లో ‘చేయవలసినవి, చేయకూడనివి’ తెలిపేలా భారీ ఎల్ ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు.

స్వర్ణదేవాలయం పరిసరాల్లో ఇటీవల తక్కువ తీవ్రతతో పేలుళ్లు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్జీపీసీ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆలయంలోని అన్ని ప్రవేశ ద్వారం వద్ద భక్తులను ఎస్జీపీసీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే స్వర్ణ దేవాలయంలోని అన్ని ప్రవేశ ద్వారాల వద్ద బాడీ, లగేజీ స్కానర్లను ఏర్పాటు చేయాలని కొంతకాలం క్రితం జరిగిన ఎస్జీపీసీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అధికారులు చెప్పారు. పోలీసుల సహకారంతో ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ ను కూడా బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు.

హిజాబ్ వివాదం.. గంగా-జమునా పాఠశాల గుర్తింపును రద్దు చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఇదిలా ఉండగా ఇటీవల గోల్డెన్ టెంపుల్ సమీపంలో మొదటి పేలుడు మే 6న చోటు చేసుకుంది. మే 8వ తేదీన రెండో పేలుడు సంభవించింది. మే 11వ తేదీన మూడో పేలుడు జరిగింది. ఆయా ఘటనలకు పాల్పడినట్టుగా భావిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులను ఛేదించామని పోలీసులు తెలిపారు.

రైల్వే మంత్రి రాజీనామా చేయాలని తృణమూల్ డిమాండ్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన బీజేపీ..

ఆపరేషన్ బ్లూస్టార్ యానివర్సరీ వీక్ నేపథ్యంలో కూడా..
ఆపరేషన్ బ్లూస్టార్ యానివర్సరీ వీక్ ను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం 28 జిల్లాల్లోని 192 సున్నితమైన ప్రాంతాల్లో శుక్రవారం 110 ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించినట్లు శాంతిభద్రతల ప్రత్యేక డీజీపీ అర్పిత్ శుక్లా తెలిపారు. ఆపరేషన్ బ్లూస్టార్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాడికల్ సిక్కు సంస్థ దాల్ ఖల్సా జూన్ 6న అమృత్ సర్ బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ కు మద్దతు కోరుతూ వాలంటీర్లు కరపత్రాలు పంపిణీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios