Asianet News TeluguAsianet News Telugu

ముస్లింలకు, షార్ట్ డ్రెస్ లు వేసుకునే వారికి నో ఎంట్రీ.. - యూపీలోని ప్రసిద్ద అలీగఢ్ హనుమాన్ ఆలయ కొత్త రూల్స్

పొట్టి, పల్చటి దుస్తులు ధరించి వచ్చే వారికి ఆలయంలోకి ప్రవేశం నిరాకరిస్తామని యూపీలోని ప్రసిద్ద అలీగఢ్ హనుమాన్ ఆలయ కమిటీ పేర్కొంది. అలాగే ముస్లింలకు కూడా ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని తెలిపింది. 

No entry for Muslims, those wearing short dresses.. - New rules of the famous Aligarh Hanuman temple in UP..ISR
Author
First Published May 18, 2023, 2:28 PM IST

ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లోని పురాతన హనుమాన్ ఆలయ నిర్వాహకులు గుడిలోకి భక్తులు ప్రవేశించే విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఇందులో ఆలయంలో ముస్లింల ప్రవేశాన్ని నిషేధించడంతో పాటు హిందూ భక్తులకు కూడా డ్రెస్ కోడ్ నిర్ణయించారు. గిల్హారీ హనుమాన్ ఆలయంగా పిలిచే ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ గుడి అచల్తలాబ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ హనుమంతుడిని ఉడుత రూపంలో పూజిస్తారు. 

‘చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు థ్యాంక్స్..’- న్యాయశాఖ మంత్రి గా తొలగింపు తర్వాత కిరణ్ రిజిజు తొలి ట్వీట్

ఈ ఆలయం వెలుపల కొత్త మార్గదర్శకాలకు సంబంధించిన పోస్టర్లను అతికించారు. అందులో ముస్లింలను ఆలయంలోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు. హిందూ భక్తులు కూడా డ్రెస్ కోడ్ ప్రకారం పొట్టి దుస్తులు ధరించి లోపలికి రాకూడదని తెలిపారు. అలాగే జీన్స్, పల్చటి దుస్తులు కూడా వేసుకొని ఆలయంలోకి ప్రవేశించకూడదని పేర్కొన్నారు. ఈ పోస్టర్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

ఉత్తర ఇటలీలో వరదల బీభత్సం.. 9 మంది మృతి, నిరాశ్రయులైన వేలాది మంది.. ఫార్ములా వన్ రేసు రద్దు..

ఈ నూతన మార్గదర్శకాలపై ఆలయ మహంత్ కౌశల్‌నాథ్ మాట్లాడుతూ.. మతపరమైన ప్రదేశాల్లో షార్ట్ డ్రెస్ లు, జీన్స్, పల్చటి దుస్తులు ధరించడం ఇతర దృష్టి మరల్చడమే అవుతుందని, ఇది ఆలయాన్ని అగౌరవపరచడం కూడా అని అన్నారు. ప్రజలు హుందాగా దుస్తులు ధరించి ఆలయానికి రావాలన్నారు. ఆలయం బయట ఏ దుస్తులు ధరించిన పర్వాలేదని, కానీ ఆలయం లోపలికి మంచి దుస్తులు ధరించి రావాలని సూచించారు. అయితే ముస్లింల నిషేధంపై ఆయన మాట్లాడుతూ.. వారు ఎలాగో పూజలు చేయడానికి ఇష్టపడరని, మరి ఆలయానికి వచ్చేందుకు ప్రయత్నించడంలో వారి అర్థం ఏంటని ఇటీవల నాసిక్ లో జరిగిన ఘటనను ఉద్దేశిస్తూ అన్నారు.

న్యాయశాఖ కొత్త మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..

ఇటీవల నాసిక్ లోని త్రయంబకేశ్వర్‌ ఆలయంలోకి కొందరు ముస్లింలు ప్రవేశించారని ఆయన తెలిపారు. అయితే ఆలీగడ్ లో అలాంటి ఘటనేమీ జరగదని చెప్పారు. కానీ ముందు జాగ్రత్త చర్యగా హిందువులు కాని వారిని ఆలయంలోకి రాకుండా నిషేధించాలని నిర్ణయించినట్లు మహంత్ కౌశల్‌నాథ్ తెలిపారు. కాగా.. శ్రీ గిల్హరాజ్ ఆలయ మహంత్ నిర్ణయాన్ని హిందూ మహాసభ జాతీయ అధికార ప్రతినిధి అశోక్ పాండే స్వాగతించారు. దీంతో ఆలయంలో అసభ్యకర చర్యలను అరికట్టవచ్చని తెలిపారు. అయితే దాస్నా దేవాలయంలో ఈ నియమం చాలా కాలంగా అమలులో ఉంది.

‘మోడీ దూరదృష్టి ఉన్న నాయకుడు’ అనే మాటకు కట్టుబడే ఉన్నాను- సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎంఆర్ షా

ఈ నెల 12వ తేదీన శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ముస్లిం యువకులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని సెక్యూరిటీ గార్డులు చూసి అడ్డుకున్నారు. ఆలయ నిర్వాహకులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios