సారాంశం
ఉత్తర ఇటలీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల వ్యవసాయ భూములు నీటమునిగాయి.
ఇటలీలోని ఉత్తర ఎమిలియా-రోమాగ్నా ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో భారీ వరదలు సంభవించాయి. ఈ వానల వల్ల కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 9 మంది మరణించారు. వేలాది మందిని నిరాశ్రయిలయ్యారు. కేవలం 36 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో వార్షిక వర్షపాతంలో సగం వర్షపాతం నమోదైందని, దీంతో నదులు తమ ఒడ్డులను ధ్వంసం చేశాయిని పౌర రక్షణ మంత్రి నెల్లో ముసుమెసి తెలిపారు. వర్షపాతం నీరు నదుల వెలుపలకు వచ్చి పట్టణాల గుండా ప్రవహిస్తోందని చెప్పారు. వేలాది ఎకరాల వ్యవసాయ భూములు మునిగిపోయాయని పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. అత్యవసర సేవలపై ఒత్తిడిని తగ్గించడానికి, మోటారు రేసింగ్ అభిమానులు ముంపు ప్రాంతంలో గుమిగూడకుండా నిరోధించడానికి వరద ప్రభావిత ప్రాంతాలకు సమీపంలోని ఇమోలాలో ఆదివారం జరగాల్సిన ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ ను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది.
ఎస్ఐ చేయిచేసుకున్నాడని ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఖమ్మంలో ఘటన
ఎమిలియా-రోమాగ్నా ప్రాంత అధ్యక్షుడు స్టెఫానో బోనాసిని విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పరిస్థితిని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. అందుకే విపత్కర ఘటనలను ఎదుర్కొంటున్నాం’’ అని అన్నారు.
కాగా.. ఈ వరదలకు ప్రారంభ క్రైస్తవ వారసత్వ ప్రదేశాలకు ప్రసిద్ధి చెందిన అడ్రియాటిక్ తీర నగరం రావెన్నా తీవ్రంగా ప్రభావితమైంది. వీలైనంత త్వరగా 14,000 మందిని ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాల్సి ఉంటుందని స్థానిక అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పినట్లు వార్తా సంస్థ ‘రాయిటర్స్’ తెలిపింది. 37 పట్టణాలు, కమ్యూనిటీలను వరదలు ముంచెత్తాయని, సుమారు 120 కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.
ఈ వరదల వల్ల బొలోగ్నా నగరానికి సమీపంలో ఉన్న ఒక వంతెన కూలిపోయింది. కొన్ని రహదారులు వరదనీటితో దెబ్బతిన్నాయి. అనేక రైలు సేవలు నిలిపివేయబడ్డాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ నదీ మట్టాలు ఇంకా పెరుగుతున్నాయని ఈ ప్రాంత ఉపాధ్యక్షురాలు ఐరీన్ ప్రియోలో విలేకరులకు తెలిపారు. సహాయక చర్యలను పరిశీలించడానికి మే 23న సమావేశం అవుతామని, అందులో వరద ప్రభావిత ప్రాంతాల కోసం 20 మిలియన్ యూరోలు (22 మిలియన్ డాలర్లు) కనుగొనాలని మంత్రివర్గాన్ని కోరనున్నట్లు పౌర రక్షణ మంత్రి ముసుమెసి చెప్పారు. అయితే ఈ ఎమర్జెన్సీ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాలకు పన్ను, తనఖా చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.