ప్రధాని మోడీని తాను గతంలో ప్రశంసించానని, ఆ మాటకు ఇప్పటికీ తాను కట్టుబడే ఉన్నానని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎంఆర్ షా అన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయాలకు, తాను వెలువరించిన తీర్పులు ఎప్పుడూ ప్రభావితం కాలేదని చెప్పారు.
మోడీ దూరదృష్టి ఉన్న నాయకుడు అని తాను గతంలో చేసిన మాటలకు కట్టుబడే ఉన్నానని, ఆ విషయంలో ఎలాంటి పశ్చాత్తమూ పడటం లేదని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎంఆర్ షా అన్నారు. తన మనస్సాక్షి స్పష్టంగా ఉందని, వ్యక్తిగత అభిప్రాయాల వల్ల తన తీర్పులు ఎప్పుడూ ప్రభావితం కాలేదని తెలిపారు. గత సోమవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ షా.. ప్రధానిని ప్రశంసించిన విషయంలో కట్టుబడే ఉన్నానని, కొంత విమర్శల గురించి తాను ఆందోళన చెందటం లేదని ఆయన ‘ఇండియా టుడే’తో అన్నారు.
సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎంఆర్ షా 2018లో ప్రధాని నరేంద్ర మోడీని పొగిడిన తర్వాత ప్రభుత్వ అనుకూలుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. సోమవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ షా ప్రధానిని ప్రశంసించడానికి కట్టుబడి ఉన్నానని, కొంత మంది విమర్శల గురించి తాను ఆందోళన చెందడం లేదని చెప్పారు. తన ప్రకటన న్యాయపరంగా తన నిర్ణయాలను ప్రభావితం చేసిందని చెప్పడానికి ఎవరూ ఎలాంటి ఉదాహరణ చెప్పలేరని అన్నారు. అసలు సంబంధం లేనివారే న్యాయమూర్తులను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం ఏముందని తాను ఏం తప్పు చెప్పానని ఎంఆర్ షా ప్రశ్నించారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీతో సత్సంబంధాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. న్యాయపరంగా కలిసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు. న్యాయమూర్తిగా తన కెరీర్ మొత్తంలో రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు లేవని స్పష్టం చేశారు. న్యాయమూర్తిగా తన కర్తవ్యాన్ని భయం, దురుద్దేశం, ఎవరికీ అనుకూలత లేకుండా నిర్వర్తించానని షా చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఎన్నో తీర్పులు ఇచ్చానని గుర్తు చేశారు. తీర్పులు ఇచ్చేటప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారో ఆలోచించబోమని అన్నారు.
ఎస్ఐ చేయిచేసుకున్నాడని ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఖమ్మంలో ఘటన
ఇంతకీ ఎంఆర్ షా ఏమన్నారంటే ?
2018లో గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో జస్టిస్ ఎంఆర్ షా పాల్గొన్నారు. ప్రధాని మోడీని పొగిడారు.‘మోడీ అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రియమైన, చైతన్యవంతమైన, దూరదృష్టి కలిగిన నాయకుడు’ అంటూ ప్రశంసించారు. దీంతో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. జస్టిస్ ఎంఆర్ షా ప్రభుత్వ అనుకూలమైన వ్యక్తి అంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆయన పదవీ విరమణ పొందిన తరువాత తాజా వ్యాఖ్యలు చేశారు.
