Asianet News TeluguAsianet News Telugu

నిత్యానందకు తీవ్ర అనారోగ్యం.. వైద్య సాయం అందించాల‌ని శ్రీలంక అధ్య‌క్షుడికి లేఖ‌

నిత్యానంద తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. స్వయం ప్రకటిత దేశమైన శ్రీకైలాసలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. దీంతో నిత్యానందకు తక్షణ వైద్య సాయం అందించాలని, రక్షణ కల్పించాలని కోరుతూ ఆ దేశం శ్రీలంక అధ్యక్షుడికి లేఖ రాసింది. 

Nityananda is seriously ill.. Letter to the President of Sri Lanka to provide medical help
Author
First Published Sep 3, 2022, 9:40 AM IST

స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో త‌న‌కు వైద్య సాయం అందించాల‌ని కోరుతూ గ‌త నెల‌లోనే శ్రీలంక అధ్య‌క్షుడికి లేఖ రాశారు. త‌న‌కు త‌క్ష‌ణ వైద్య సాయం అవ‌స‌రం ఉందంటూ అందులో పేర్కొన్నారు. సార్వభౌమ రాజ్యమైన శ్రీకైలాసలో వైద్యపరమైన మౌలిక సదుపాయాల కొరత ఉంద‌ని పేర్కొన్నారు.

అగ్రవర్ణ మహిళను పెళ్లి చేసుకున్న దళిత వ్యక్తిని హత్య చేసిన అత్తమామలు..

శ్రీకైలాస విదేశాంగ మంత్రిగా చెప్పుకునే నిత్యప్రేమాత్మ ఆనంద స్వామి శ్రీలంక ప్ర‌ధాన మంత్రికి రాసిన లేఖ‌లో ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ‘‘ హిందూ మతం సుప్రీం పోంటిఫ్ (SPH) నిత్యానంద పరమశివంకు తక్షణ వైద్య సంరక్షణ అవసరం. ప్రస్తుతం కైలాసంలో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. వైద్యులు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని నిర్ధారించ‌లేక‌పోతున్నారు. నిత్యానంద ప్ర‌స్తుతం శ్రీకైలాస సార్వభౌమ భూమిలో ఉన్నారు. ’’ అని ఆయన పేర్కొన్నారు. 
మ‌ణిపూర్ లో జేడీ(యూ)కు ఎదురుదెబ్బ‌.. అధికార బీజేపీలోకి విలీన‌మైన 5 గురు ఎమ్మెల్యేలు..

“ నిత్యానంద ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయ‌న‌కు తక్షణమే రాజకీయ ఆశ్రయం కల్పించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఇలా చేస్తే ఆయ‌న‌ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా విమానంలో తరలించి, డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ శ్రీలంక‌లో సురక్షితంగా వైద్య చికిత్స అందించ‌వ‌చ్చు. ప‌లు శ‌క్తుల నుంచి SPH  ప్రాణం ప్రమాదంలో ఉన్నందున..శ్రీకైలాస దేశాధినేత భ‌ద్ర‌త‌కు హామీ ఇవ్వాల్సిన అస‌వ‌రం ఉంద‌ని మేము న‌మ్ముతున్నాం’’ అని ఆ మంత్రి తెలిపారు. 

ఒక భార్య - ఇద్దరు భర్తలు : ఆమె కోసం మొదటి భర్తను కిడ్నాప్ చేసిన రెండో భర్త, హత్యాయత్నం.. అరెస్ట్...

‘‘ శ్రీకైలాస SPH చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను మా దేశం కొనుగోలు చేసి తీసుకువస్తుంది. శ్రీలంకలో జరిగే అన్ని వైద్య ఖర్చులను కూడా భ‌రిస్తుంది. దీనికి కృతజ్ఞతగా మేము శ్రీలంక ప్ర‌జ‌ల కోసం మిలియన్ డాలర్ల విలువైన ఆ వైద్య పరికరాలను వ‌దిలేస్తాం ’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఒక సారి త‌న‌కు రాజ‌కీయ ఆశ్ర‌యం మంజూరైతే శ్రీలంకలో పెట్టుబడులు కూడా పెడ‌తామ‌ని ఆ లేఖ‌లో తెలిపారు.

సరిగా లైన్లో నిలబడలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్, ప్రిన్సిపల్.. ఇద్దరి అరెస్ట్..

కిడ్నాప్ ఆరోపణలపై ఆయ‌న ఇద్దరు శిష్యులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత 2018 నవంబర్‌లో నిత్యానంద భారతదేశం నుండి పారిపోయారు. కర్ణాటకలో నిత్యానందపై అత్యాచారం ఆరోపణలు కూడా నమోదయ్యాయి. ఆయ‌న ఇటీవ‌ల ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి శ్రీకైలాస అని పేరు పెట్టారు. శ్రీకైలాస ఒక దేశం అని పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios