Asianet News TeluguAsianet News Telugu

సరిగా లైన్లో నిలబడలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్, ప్రిన్సిపల్.. ఇద్దరి అరెస్ట్..

ఓ స్కూల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. లైన్లో నిలబడలేదని ఓ విద్యార్థిని టీచర్, ప్రిన్సిపాల్ చితకబాదారు. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Teacher Headmaster Arrested For Assaulting Student In Rajasthan
Author
First Published Sep 3, 2022, 7:11 AM IST

రాజస్థాన్ : సరిగా లైన్లో నిలబడలేదని ఓ టీచర్ విద్యార్థిపై పైశాచికత్వం చూపించాడు. నాకే ఎదురు చెబుతావా అంటూ.. చెప్పుతో చితకబాదాడు. దీంతో ఈ నేరానికి పాల్పడిన ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్ ను, ప్రధానోపాధ్యాయుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థి కుటుంబం, పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయుడు వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సర్కిల్ ఆఫీసర్, రింగస్, కన్హయ్యాలాల్ మాట్లాడుతూ, పాఠశాల ప్రార్థనా సమావేశంలో, 12వ తరగతి విద్యార్థి ఆశిష్ తేత్వాను నిందితుడైన సదరు టీచర్ ప్రదీప్ సరిగ్గా లైన్‌లో నిలబడలేడని చెప్పుతో  కొట్టాడు. దీనికి ఆ విద్యార్థి అభ్యంతరం వ్యక్తం చేశాడు.  

దీంతో కోపానికి వచ్చిన సదరు టీచర్ ప్రదీప్‌,ప్రధానోపాధ్యాయుడు సాగర్‌మల్‌ ఆ విద్యార్థిని గదిలోకి తీసుకెళ్లి కొట్టారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటన బుధవారం జరిగింది. కాగా ఒక రోజు ఆలస్యంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేసినట్లు కన్హయ్యాలాల్ తెలిపారు. పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయుడు సదరు విద్యార్థి ఘటన జరిగిన రోజు తనను చెంపదెబ్బ కొట్టాడని ఆరోపిస్తూ విద్యార్థిపై కేసు పెట్టాడని.. అతని ఫిర్యాదును కూడా నమోదు చేశామని, ఈ రెండు కేసులను విచారిస్తున్నామని తెలిపారు.

మేక విక్రయం.. కోపంతో తల్లిని చంపిన కొడుకు..

కాగా, తెలంగాణలో ఇలా ఓ టీచర్ అత్యుత్సాహం, మూర్ఖత్వంతో ఓ విద్యార్థి కాళ్లు కోల్పోయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్లి.. హాస్టల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. విద్యార్థినిపై హౌస్ టీచర్ అమానుషంగా ప్ర‌వ‌ర్తించింది. పనిష్మెంట్ ఇచ్చింది. ఆ పేరుతో ఐదు రోజుల పాటు ఆ విద్యార్థిని చిత్ర‌హింస‌ల‌కు గురి చేసింది. ఐదు రోజులు.. రోజూ ఎనిమిది గంట‌ల‌ పాటు.. హాస్టల్‌ ముందు నిలబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు చ‌చ్చుబ‌డ్డాయి. ఆచేత‌నంగా మారిపోయాయి. దీంతో నడవలేని స్థితిలో ఉన్న‌..ఆ విద్యార్థిని చికిత్స కోసం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

వివరాల్లోకెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం రేగడ్డ మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక అనే అమ్మాయి వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ లాస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే అస్వస్థతగా ఉండడంతో ఈ నెల 18వ తేదీన ఒకరోజు సెలవు తీసుకుని ఇంటికి వెళ్లింది. ఆస్ప‌త్రిలో చూపించుకుని, రీక‌వ‌రి అయింది. ఆ త‌రువాత రెండు రోజులు ఆలస్యంగా 22వ తేదీన కాలేజీకి వ‌చ్చింది. దీంతో  మూడు రోజులు అధికంగా సెలవు తీసుకుందని హౌస్ టీచర్ కోపానికి వచ్చింది. విద్యార్థినిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

వచ్చిన రోజునుంచి ఐదురోజుల పాటు రోజూ దాదాపు ఎనిమిది గంట‌ల పాటు హాస్టల్‌ బయటే నిలబెట్టింది. కాలేజీకి కూడా వెళ్లనీయలేదు. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు మొద్దుబారిపోయాయి. స్పర్శ తెలియడం లేదు. నడవలేనిస్థితిలో ఉన్న నిహారికను హాస్టల్‌ లోని ఆరోగ్య సిబ్బంది వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విష‌యం తెలుసుకున్న నిహారిక త‌ల్లిదండ్రులు అధ్యాపకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios