Asianet News TeluguAsianet News Telugu

మ‌ణిపూర్ లో జేడీ(యూ)కు ఎదురుదెబ్బ‌.. అధికార బీజేపీలోకి విలీన‌మైన 5 గురు ఎమ్మెల్యేలు..

మణిపూర్ జేజేడీ(యూ)కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం అయ్యారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ నితీష్ కుమార్ పార్టీకి 6 గురు ఎమ్మెల్యేలు ఉండగా ప్రస్తుతం ఒక్కరు మాత్రమే మిగిలారు. ఈ పరిణామం కాంగ్రెస్ మండిపడింది. 

Five people join the ruling BJP in Manipur JD(U) MLAs merged
Author
First Published Sep 3, 2022, 8:50 AM IST

మ‌ణిపూర్ లో జేడీ(యూ)కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండ‌గా.. అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి అధికార బీజేపీలో విలీనం అయ్యారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలను మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభలో విలీనం చేసేందుకు స్పీకర్ తొక్చోమ్ సత్యబ్రతా సింగ్ అంగీకరించారని ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి కె.మేఘజిత్ సింగ్ ప్ర‌క‌టించారు.

ఒక భార్య - ఇద్దరు భర్తలు : ఆమె కోసం మొదటి భర్తను కిడ్నాప్ చేసిన రెండో భర్త, హత్యాయత్నం.. అరెస్ట్... 

బీజేపీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేల‌లో ఖుముక్చామ్ జోయ్కిసన్ సింగ్ (తంగ్మేబంద్), న్గుర్సంగ్లూర్ సనతే (టిపాయ్ముఖ్), మహ్మద్ అచాబ్ ఉద్దీన్ (జిరిబమ్), తంగ్జమ్ అరుణ్కుమార్ (వాంగ్ఖీ), ఎల్ఎం ఖౌటే (చురాచంద్పూర్) ఉన్నారు.

కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో మ‌ణిపూర్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. అక్క‌డ 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో జేడీ(యూ) ఆరు స్థానాలు గెలుచుకుంది. ఆ స‌మ‌యంలో బీహార్ ఎన్డీఏలో జేడీ(యూ) భాగ‌స్వామిగా ఉంది. దీంతో బీజేపీకి ఆ పార్టీకి మ‌ధ్య త‌త్సంబంధాలు ఉండేవి. అందుకే ఆ స‌మ‌యంలో బీజేపీ నేతృత్వంలో ఏర్ప‌డిన బీరేన్ సింగ్ ప్ర‌భుత్వానికి జేడీ(యూ) మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. అయితే మంత్రి ప‌ద‌వులు మాత్రం తీసుకోలేదు.

సరిగా లైన్లో నిలబడలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్, ప్రిన్సిపల్.. ఇద్దరి అరెస్ట్..

బీజేపీలో చేరని ఆరో ఎమ్మెల్యే మహ్మద్ నాసిర్ లిలాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జేడీ (యూ)ఎమ్మెల్యేల నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. మణిపూర్ కు చెందిన ఆరుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో 5 మంది బీజేపీలో విలీనం కావడం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదని, భారత రాజ్యాంగం ప్రకారం అనర్హత వేటు పడుతుందని మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నింగోంబం బుపెండా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. ‘‘ ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయిస్తాం. రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..’’ అంటూ ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌.. కానీ..

కాగా.. ఈ నెల మొద‌ట్లోనే ఎన్నికల సంఘం మణిపూర్‌లో జేడీ (యూ)ని రాష్ట్ర పార్టీగా గుర్తించింది. అయితే  బీహార్ లో గ‌త నెల బీజేపీ నుంచి తెగ‌దింపులు చేసుకున్న ఆ పార్టీ మ‌ణిపూర్ లోనూ అలాంటి దారిలోనే వెళ్లాల‌ని ఇటీవ‌ల నిర్ణ‌యించుకుంది. నేడు, రేపు జ‌రిగే జాతీయ కార్యవర్గం, జాతీయ మండలి సమావేశాల్లో ఈ నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ దీనికి ముందే బీజేపీలోకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేరిపోయారు. దీనిపై నితీష్ కుమార్ ఎలా రియాక్ట్ అవుతార‌నేది వేచి చూడాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios