విపక్షాల కూటమికి ‘ఇండియా’ అనే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన నితీష్ కుమార్.. ఎందుకంటే ?
26 పార్టీల విపక్ష కూటమిలో బీహార్ సీఎం కీలకంగా ఉన్నారు. అయితే ఈ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టడం ఆయనకు నచ్చలేదు. కానీ ఆ పేరును అన్ని పార్టీలు అంగీకరించడంతో చివరకు బీహార్ సీఎం కూడా అయిష్టంగానే ఒప్పుకున్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగళూరులో మంగళవారం 26 పార్టీలు సమావేశమయ్యాయి. విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేరుపై బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ‘ఇండియా’ అనే పేరు ఆయనకు నచ్చలేదని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలిపింది.
2024 లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది.. కాంగ్రెస్ హమీలన్నీ బూటకమే - మాయావతి
వాస్తవానికి బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల అనధికార సమావేశం సోమవారం జరిగింది. ఇందులో అన్ని పార్టీలు విపక్ష కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టాలని ప్రతిపాదించాయి. అయితే ఇండియా అనే పదంలో ఎన్ డీ ఏ అనే అక్షరాలు ప్రస్పుటించడంతో దానిని బీహార్ సీఎం వ్యతిరేకించారు. కానీ ఆ తరువాత మరుసటి రోజు ఈ పేరును అందరూ అంగీకరించడంతో, అధికారికంగా మంగళవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో నితీష్ కుమార్ కూడా ఆ పేరును అంగీకరించాల్సి వచ్చింది. ‘సరే, మీరంతా దీనికి (ఇండియా పేరు) ఓకే అయితే.. నాకు కూడా ఫర్వాలేదు’ అని బీహార్ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
కాగా.. ఇండియా అనే పేరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారని విడుతలై చిరుతైగళ్ కట్చి చీఫ్ తోల్ తిరుమావళవన్ తెలిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం దీన్ని‘ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్’ అని పిలవాలని నిర్ణయించారని చెప్పారు.
ఈ పేరును ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. రాజ్యాంగాన్ని, భారతీయుల గొంతును, భారతదేశ భావనను తాము కాపాడుతున్నామని అన్నారు. 2024 ఎన్నికలు బీజేపీ సిద్ధాంతాలకు, వారి ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం అని తెలిపారు. ఈ పోరు ఎన్డీయేకు, నరేంద్ర మోడీకి, బీజేపీకి, ఆయన భావజాలానికి వ్యతిరేకంగా సాగుతుందని చెప్పారు. అన్ని మ్యాచ్ ల్లోనూ భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బ్రేకింగ్.. బెంగళూరులో భారీ ఉగ్రదాడి భగ్నం.. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇండియా పేరుకు కౌంటర్ గా ప్రధాని ‘భారత్’ గురించి మాట్లాడారు. ఎన్ డీఏ పేదలు, వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. ఎన్డీఏలో ఎన్ అంటే న్యూ ఇండియా, డీ అంటే అభివృద్ధి చెందిన దేశం, ఏ అంటే ప్రజలు, ప్రాంతాల ఆకాంక్షలు అని ప్రధాని మోడీ అన్నారు. ప్రతిపక్ష సమావేశాన్ని అవినీతిపరుల సమావేశం అని, కుటుంబం కోసం అనే మంత్రంతో కూడిన సమావేశంగా ప్రధాని తెలిపారు.