‘ఇండియా’ కూటమికి కొత్త ట్యాగ్ లైన్.. ‘జీతేగా భారత్’ అని ఖరారు.. దీని ఏర్పాటు వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ?
ప్రతిపక్షాల కూటమికి ‘ఇండియా’ అనే పేరు ఖరారు అయిన మరోసటి రోజు దానికి మరో ట్యాగ్ లైన్ ఏర్పాటు చేశారు. ‘జీతేగా భారత్’ అని దానికి నామకరణం చేశారు. దీనిని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సూచించారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఏర్పాటైన కూటమికి ట్యాగ్ లైన్ గా 26 పార్టీల ప్రతిపక్ష ఫ్రంట్ ఐఎన్ డీఐఏ (ఇండియా)ను ఎంచుకున్న మరుసటి రోజు ‘జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది)’ అనే ట్యాగ్ లైన్ ను ఖరారు చేశాయి. మంగళవారం రాత్రి జరిగిన చర్చల అనంతరం ఈ తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్యాగ్ లైన్ ను పలు ప్రాంతీయ భాషల్లో అనుకరించే అవకాశం ఉందని ‘పీటీఐ’ తెలిపింది.
రెండు రోజుల బెంగళూరు సదస్సులో 26 ప్రతిపక్ష పార్టీల నాయకులు కూటమికి ఐఎన్ డిఐఎ - ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్ అని నామకరణం చేసిన సమయంలోనే కూటమి పేరులో "భారత్" అనే పదం ఉండాలని అందరూ భావించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత శివసేన చీఫ్ (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) ప్రతిపక్ష కూటమికి ఈ హిందీ ట్యాగ్ లైన్ ఉండాలని సూచించారు.
2024 ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ‘భారత్ వర్సెస్ ఇండియా’ అనే పంథాను ఎంచుకోకుండా, ఆ స్లోగన్స్ ను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ‘భారత్’ అనే ట్యాగ్ లైన్ రూపొంచారు. కాగా.. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2024 ఎన్నికలు బీజేపీ సిద్ధాంతాలకు, వారి ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం అని అన్నారు. ఈ పోరు ఎన్డీయేకు, నరేంద్ర మోడీకి, బీజేపీకి, ఆయన భావజాలానికి వ్యతిరేకంగా సాగుతుందని అన్నారు. అన్ని మ్యాచ్ ల్లోనూ భారత్ గెలుస్తుందన్నారు.
ఇదిలా ఉండగా.. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశమై తమ ఐక్యతను ప్రదర్శించగా.. దానికి సమాంతరంగా బీజేపీ 39 పార్టీల ప్రతినిధులతో ఢిల్లీలో సమాంతర బలప్రదర్శన నిర్వహించింది. నెగిటివిటీపై నిర్మించిన పొత్తులు ఎన్నడూ గెలవలేవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి వంశపారంపర్యంగా, అవినీతిమయంగా ఉంటే దేశం నష్టపోతుందని ఆయన అన్నారు.
ఇండియా పేరుకు కౌంటర్ గా ప్రధాని ‘భారత్’ గురించి మాట్లాడారు. ఎన్ డీఏ పేదలు, వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తుందని అన్నారు. ఎన్డీఏలో ఎన్ అంటే న్యూ ఇండియా, డీ అంటే అభివృద్ధి చెందిన దేశం, ఏ అంటే ప్రజలు, ప్రాంతాల ఆకాంక్షలు అని ప్రధాని మోడీ అన్నారు. ప్రతిపక్ష సమావేశాన్ని అవినీతిపరుల సమావేశం అని, కుటుంబం కోసం అనే మంత్రంతో కూడిన సమావేశంగా ప్రధాని అభివర్ణించారు.