విషాదం.. 220 మంది చిన్నారులు దుర్మరణం.. ఇదేం మహహ్మారి..
విపరీతమైన చలి, చల్లగాలుల వల్ల పాకిస్థాన్ లో న్యుమోనియా పాకిస్థాన్ (pakisthan)లో వేగంగా వ్యాపిస్తుంది. గడిచిన మూడు వారాల్లో పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఈ వ్యాధి వల్ల 220 మంది చిన్నారులు (At least 220 children die of pneumonia in Pakistan's Punjab province) చనిపోయారు. చిన్నారులంతా ఐదేళ్ల లోపు పిల్లలే ( Children under the age of five) కావడం ఆందోళన కలిగిస్తోంది.
పాకిస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు వారాల్లో విపరీతమైన చలికి న్యుమోనియా కారణంగా 220 మంది చిన్నారులు చనిపోయారు. మరణించిన పిల్లలందరూ ఐదేళ్లలోపు వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో 47 మంది పిల్లలు ఒక్క లాహోర్‌లోనే మరణించారు. గతేడాది పంజాబ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా కారణంగా 990 మంది చిన్నారులు చనిపోయారు. కాగా.. ఈ ఏడాది జనవరి 1 నాటికి ప్రావిన్స్‌లో 10,520 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి.
ప్రతికూల వాతావరణం కారణంగా జనవరి 31 వరకు ప్రావిన్స్ లోని పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీ నిర్వహణపై పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. ఇదిలా ఉండగా.. మరణించిన పిల్లలలో చాలా మందికి న్యుమోనియా టీకాలు వేయలేదని ప్రభుత్వం తెలిపింది. చనిపోయిన పిల్లలు పోషకాహారలోపం, రోగనిరోధక శక్తి లేమితో బాధపడుతున్నారని పేర్కొంది. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పిల్లలకు మాస్క్‌లు ధరించాలని, చేతులు కడుక్కోవాలని, వెచ్చని దుస్తులు ధరించాలని ప్రభుత్వం సూచించింది.
ఈ ఘటనపై.. పంజాబ్‌లోని ఎక్స్‌పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఇపీఐ) డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో సాధారణంగా పుట్టిన ఆరు వారాల తర్వాత శిశువులకు యాంటీ న్యుమోనియా వ్యాక్సిన్‌ను ఇస్తారని చెప్పారు. అయితే న్యుమోనియా బాక్టీరియా, వైరస్ రెండింటి వల్ల సోకవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ వేసిన పిల్లలకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుందని, కానీ వైరల్ న్యుమోనియా ద్వారా సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు.
Election 2024: ఎన్నికల భారతం.. 96 కోట్లమంది అర్హులే..!
పిల్లలలో న్యుమోనియా కేసులు పెరగడంపై ప్రావిన్స్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో న్యుమోనియా నుంచి చిన్నారులను రక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీనియర్ వైద్యులను ప్రభుత్వం ఆదేశించింది. చలి వాతావరణం పెరగడం వల్ల పిల్లల్లో వైరల్ న్యుమోనియా వ్యాధి వేగంగా పెరుగుతోందని, ఈ వ్యాధి కోవిడ్-19 లాగా విస్తరిస్తున్నదని పేర్కొంది.