న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఇద్దరు దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తాల తరఫున వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్ న్యాయవ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థు చేస్తున్న హత్య అని ఆయన వ్యాఖ్యానించాడు. నిర్భయ కేసులో దోషులను ఇప్పటికే నాలుగు సార్లు చంపారని, వారేమీ ఉగ్రవాదులు కారని ఆయన అన్నారు.

నిర్భయ కేసు దోషులకు పాటియాల హౌస్ కోర్టు మరోసారి డెత్ వారంట్ జారీ చేసిన తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. దోషులకు నాలుగుసార్లు డెత్ వారంట్లు జారీ చేసి నాలుగు సార్లు చంపారని ఆయన అన్నారు. భయంకరమైన నేరస్థులకు చిత్రీకరించి మీడియా వారిని ఎప్పుడో చంపేసిందని అన్నారు. 

Also Read: నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్లు: నిర్భయ తల్లీ ఏమన్నారంటే..

నిర్భయ కేసులోని దోషులను ఉరిశిక్ష నుంచి కాపాడేందుకు చట్టపరమైన వెసులుబాట్లను వాడుతూ వస్తున్న ఏపీ సింగ్ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిర్భయపై కూడా ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. నిర్భయపై అత్యాచారం జరగడానికి ఆమె వేసుకున్న దుస్తులు, ఆమె జీవన విధానం కారణమని కూడా ఆయన గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

తన కూతురు ఇలా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుంటే సజీవంగా దగ్ధం చేసేవాడినని, ఇలాంటి ఘటన జరగనిచ్చేవాడని కాదని కూడా ఆయన అన్నారు. నలుగురు దోషులకు పూర్తిగా దారులు మూసుకుపోయాయి. చట్టపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. ఇక ఈ నెల 20వ తేదీన వారికి ఉరిశిక్ష పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ స్థితిలో ఏపీ సింగ్ వ్యాఖ్యలు చేశారు. 

Also Read: నిర్భయ కేసు: దోషులకు కొత్త డెత్ వారంట్, ఉరి తీసేదీ ఆ రోజే