నిర్భయ దోషులకు న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోవడంతో ఢిల్లీలోని పటియాలా హౌస్‌కోర్టు నాలుగో సారి కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 20న ఉదయం 5.30కి నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాల్సిందిగా కోర్టు అధికారులను ఆదేశించింది.

ఈ సందర్భంగా నిర్భయ తల్లీ ఆశాదేవి మాట్లాడుతూ... తన కుమార్తెను చంపినవారు ఎట్టకేలకు ఉరికంభం ఎక్కబోతున్నారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలైతే తమ పోరాటం ఫలించినట్లేనని ఆశాదేవీ తెలిపారు.

Also Read: నిర్భయ కేసు: దోషులకు కొత్త డెత్ వారంట్, ఉరి తీసేదీ ఆ రోజే

అంతకుముందు పవన్ గుప్తా అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దోషులకు శిక్షపడే వరకు తనకు మనశ్శాంతి ఉండదని.. నలుగురు దోషులు చట్టాల్లోని లొసుగులు ఉపయోగించుకుని బయటపడాలని ప్రయత్నించినా కుదరలేదన్నారు.

ఇప్పటి వరకు తన కోర్టులో వాదనలు వినడం, వాయిదా పడటం చూశానన్నారు. ప్రపంచం మొత్తం దోషులను ఉరి తీయాలని కోరుకుంటోందని ఆశాదేవి తెలిపారు. 

ఇప్పటికే మూడు దఫాలు ఈ దోషులకు ఉరి వాయిదా పడింది. జనవరి 22, ఫిబ్రవరి 1, మార్చి 3వ తేదీన ఉరి తీయాలని డెత్ వారంట్లు జారీ అయ్యాయి. కానీ  దోషులు తమకు ఉన్న అన్ని రకాల న్యాయ అంశాలను వినియోగించుకొన్నారు.

Also Read:నిర్భయ కేసు: అప్షన్లన్నీ ఖతమ్, దోషులకు ఉరి ఎప్పుడంటే...

తాజాగా ఈ కేసులో దోషి పవన్ గుప్తా ఈ నెల 2వ తేదీన దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.అదే రోజున రాష్ట్రపతికి  క్షమాభిక్ష కోరుతూ పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. 

పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను ఈ నెల 4వ తేదీన రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. దీంతో తీహార్ జైలు అధికారులు ఢిల్లీ  కోర్టులో కొత్త డెత్ వారంట్ కోసం ఈ నెల 4 వతేదీన పిటిషన్ దాఖలు చేశారు.