Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ కేసు: దోషులకు కొత్త డెత్ వారంట్, ఉరి తీసేదీ ఆ రోజే

నిర్భయ దోషులకు ఈ నెల 20  వ తేదీన ఉరి తీయాలని  ఢిల్లీ  కోర్టు గురువారం  నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
 

Nirbhaya Case: Delhi Court issues a fresh death warrant against the four convicts
Author
New Delhi, First Published Mar 5, 2020, 2:39 PM IST

న్యూఢిల్లీ:  నిర్భయ దోషులకు ఈ నెల 20  వ తేదీన ఉరి తీయాలని  ఢిల్లీ  కోర్టు గురువారం  నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే మూడు దఫాలు ఈ దోషులకు ఉరి వాయిదా పడింది. జనవరి 22, ఫిబ్రవరి 1, మార్చి 3వ తేదీన ఉరి తీయాలని డెత్ వారంట్లు జారీ అయ్యాయి. కానీ  దోషులు తమకు ఉన్న అన్ని రకాల న్యాయ అంశాలను వినియోగించుకొన్నారు.

Also read:నిర్భయ కేసు: అప్షన్లన్నీ ఖతమ్, దోషులకు ఉరి ఎప్పుడంటే....

దీంతో మూడు దఫాలు డెత్ వారంట్లు ఇచ్చినా కూడ ఉరిశిక్షను అమలు చేయలేదు. తాజాగా ఈ కేసులో దోషి పవన్ గుప్తా ఈ నెల 2వ తేదీన దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.అదే రోజున రాష్ట్రపతికి  క్షమాభిక్ష కోరుతూ పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. 

పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను ఈ నెల 4వ తేదీన రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. దీంతో తీహార్ జైలు అధికారులు ఢిల్లీ  కోర్టులో కొత్త డెత్ వారంట్ కోసం ఈ నెల 4 వతేదీన పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై కోర్టు విచారించింది. గురువారం నాడు కొత్త డెత్ వారంట్ ను జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 20వ తేదీన ఉదయం 5:30 గంటలకు ఈ నలుగురిని ఉరి తీయాలని కోర్టు కొత్త డెత్ వారంట్ జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios