Asianet News TeluguAsianet News Telugu

నిర్భయ దోషులను ఉరి తీసేటప్పుడు ఎవరెవరు ఉన్నారంటే....

నిర్భయ దోషులను నేటి ఉదయం 5.30కు ఉరి తీసిన విషయం తెలిసిందే! 2012లో ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ లో అత్యంత పాశవికంగా ఆ యువతిని చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఎట్టకేలకు వారికి ఉరి పడింది.ఇక ఈ మొత్తం ఉరి సీన్ కి ప్రత్యక్ష సాక్షులుగా 5గురు అధికారులు వ్యవహరించారు.

Nirbhaya Case: Five people who were witness to the convicts hanging
Author
New Delhi, First Published Mar 20, 2020, 6:58 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నిర్భయ కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగిందని, నిర్భయ తల్లి వ్యాఖ్యానించింది. 2012లో ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ లో నిర్భయ మరణించింది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటనలో ఆ యువతి ఆత్మకు ఎట్టకేలకు శాంతి కలిగింది. నలుగురు దోషులను ఉరి తీసేసారు. 

ఉరి తీసిన తరువాత వారి శవాలను అలానే అరగంటపాటు ఏలాడనిచ్చి ఆ తరువాత కిందికి దింపారు. ఆ తరువాత్య డాక్టర్ నాలుగు శవాలను పరీక్షించి వారు మరణించారు అని ధృవీకరించాడు. ప్రస్తుతానికి వారి శవాలను పోస్టుమార్టం కి పంపించారు. పోస్టుమార్టం పూర్తయిన తరువాత వారి శవాలను కుటుంబ సభ్యులకు అందజేస్తారు. 

ఇక ఈ మొత్తం ఉరి సీన్ కి ప్రత్యక్ష సాక్షులుగా 5గురు అధికారులు వ్యవహరించారు. ప్రోటోకాల్ ప్రకారం జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, లోకల్ మెజిస్ట్రేట్ తో పాటు ఒక జైలు అధికారి ఉంటారు. వీరు ఈ దోషులను ఉరి తీసేటప్పుడు జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నిటినీ పూర్తిచేశారు. 

Also read: నిర్భయ దోషులకు ఉరి: వారు రాత్రి నుంచి జైలులో ఏం చేశారంటే....

ఉరికి ముందు కూడా వారు ఉరిని తప్పించుకోవడానికి విశ్వా ప్రయత్నమే చేసారు. అయినా వారి పిటిషన్లను కోర్టు కొట్టివేయడంతో వారికి ఉరి ఖాయమైపోయింది. ఇక నిన్న రాత్రి కూడా దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో లాయర్ కొన్ని వ్యాఖ్యలు చేసాడు. 

నిందితులకు ఉరి వేస్తే ఏమొస్తుందని, కొన్ని రోజుల్లోనే అందరూ వారి గురించి మర్చిపోతారని అన్నాడు. అవసరమైతే వారిని ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో కానీ, లేదా డోక్లామ్ కి కానీ పంపించాలని, వారు దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 

అక్కడితో ఆగకుండా... వారిని ఉరి తీసేకంటే, వారిని మెడికల్ టెస్టులకు వినియోగించుకోవాలని అన్నాడు. వారు అలాగైనా దేశానికి ఉపయోగపడతారని ఆయన అన్నాడు. అంతే తప్ప వారిని ఉరి మాత్రం తీయొద్దని అన్నాడు. 

ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సంఘటనలను ఒకసారి చూద్దాం. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు తాను ఢిల్లీలోనే లేనని నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ సుప్రీమ్ తలుపు తట్టాడు. తనకు ఆ ఉదంతానికి సంబంధం లేదని చెబుతున్నప్పటికీ కింది కోర్టులు తన మాటను వినిపించుకోలేదని సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. 

అత్యవసర పిటిషన్ గా పరిగణించిన సుప్రీమ్ కోర్టు, ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 2.30కు వాదనలు వినడం ఆరంభించింది. వాదనలను విన్న సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. 

Also read: ఉరికి ముందు కూడా డ్రామాలు ఆపని నిర్భయ దోషులు, ఏమి చేశారంటే...

ఇక మరో దోషి పవన్ గుప్తా ఫైల్ చేసిన రెండవ క్యూరేటివ్ పిటిషన్ ను కూడా నిన్న  ఉదయం కోర్టు తోసిపుచ్చింది. నేరం జరిగినప్పుడు తాను  మైనర్ నని, కింద కోర్టులు తన వాదనను వినలేదని తెలుపుతూ రెండవసారి క్యూరేటివ్ పిటిషన్ ఫైల్ చేసాడు. కానీ కోర్టు మరోసారి కొట్టేసింది. 

ఇక ఈ కేసులో మరో నిందితుడు అక్షయ్ సింగ్ భార్య తనకు విడాకులు కావాలని బీహార్ కోర్టు మెట్లెక్కింది. ఒక రేపిస్టు భార్యగా తాను వైధవ్యాన్ని పొందదలుచుకోట్లేదని ఆమె కోర్టుకెక్కారు. కోర్టు ఆ పిటిషన్ ను విచారానికి స్వీకరించలేదు. 

ఇదే అక్షయ్ సింగ్ సుప్రీమ్ లో తన క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని ఛాలెంజ్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేసాడు. ఆ కేసును వాదిస్తున్న నిందితుడి లాయర్ ఏపీ సింగ్ తన వాదనలు వినిపిస్తూ... చట్టప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ని కొట్టివేసిన విధానం కరెక్ట్ కాదని తెలిపాడు. 

అంతే కాకుండా తీవ్రమైన ప్రజల ఒత్తిడి కారణంగా కేసు విచారణ పక్షపాతంగా సాగించని కూడా ఆయన వాదించారు. ఆ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు ఆ పిటిషన్ ను కూడా కొట్టివేసింది. 

నిందితుల తరుఫు లాయర్ ఈ కేసులతో ఆగకుండా.... మరో పిటిషన్ కూడా వేసాడు. నిందితులవి అనేక కేసులు విచారణలో ఉన్నందున రేపటి మరణ శిక్షపైన స్టే విధించాలని ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసాడు. కోర్టు ఆ పిటిషన్ ని కూడా కొట్టేసింది. 

నిన్న రాత్రి ఇంత జరిగినా... వారు మరల కోర్టుకెక్కినప్పటికీ వారి టైం మూడిందని కోర్టు తేల్చి చెప్పడంతో వారిని ఉరి తీసేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios