Asianet News TeluguAsianet News Telugu

NIA raids: కల్యాణ్ రావు సహా మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో సోదాలు

ఆర్కే జీవిత చరిత్ర ముద్రణ నేపథ్యంలో ఎన్ఐఎ మావోయిస్టు సానుభూతిపరులు, మాజీ Maoistల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. విరసం ప్రతినిధి కల్యాణ్ రావు నివాసంలో కూడా NIA సోదాలు నిర్వహిస్తోంది.

NIA raids Moaists simpathisers including Kayan Rao residences
Author
Hyderabad, First Published Nov 18, 2021, 8:21 AM IST

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మాజీ మావోయిస్టుల ఇళ్లలో సానుభూతిపరుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. విప్లవ రచయిత కల్యాణ్ రావు నివాసంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. అదే విధంగా విశాఖపట్నంలోని అనురాధ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మాజీ మావోయిస్టు రవిశర్మ నివాసంలో సైతం సోదాలు జరుగుతున్నాయి. 

కల్యాణ్ రావు గతంలో మావోయిస్టు చర్చల ప్రతినిధిగా పనిచేశారు. అంటరాని వసంతం నవల రాసిన ఆయన విప్లవ రచయితల సంఘం (విరసం)లో కీలక పాత్ర పోషిస్తున్నారు. విప్లవ సానుభూతిపరులకు, మాజీ మావోయిస్టులకు మావోయిస్టులతో ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. గతంలో కూడా ఎన్ఐఏ ఇటువంటి సోదాలు నిర్వహించింది. 

Also Read: బీజాపూర్ : మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మీద ఓ పుస్తక ముద్రణ జరిగింది. ఈ పుస్తకం కాపీలను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆ పుస్తక ప్రచురణ చేపట్టిన నవ్య అధినేత రామకృష్ణా రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది. ఆర్కే జీవిత చరిత్రపై రాసిన ఆ పుస్తకంపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది. 

Also Read: మృతదేహంపై ఎర్ర జెండా.. భారీగా హాజరైన జనం, మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అంత్యక్రియల ఫోటోలు వైరల్

ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు కల్యాణ్ రావు సన్నిహితుడని చెబుతుంటారు. దాంతో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios