Asianet News TeluguAsianet News Telugu

మృతదేహంపై ఎర్ర జెండా.. భారీగా హాజరైన జనం, మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అంత్యక్రియల ఫోటోలు వైరల్

అనారోగ్యంతో మరణించిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలను మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది. ఆయన అంత్యక్రియలను మావోయిస్ట్ లాంఛనాలతో  పూర్తి చేసినట్లు ఆ ఫోటోలను బట్టి చెప్పవచ్చు. 

maoist leader rk funeral photos goes viral
Author
Chhattisgarh, First Published Oct 16, 2021, 2:36 PM IST

అనారోగ్యంతో మరణించిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలను మావోయిస్ట్ పార్టీ విడుదల చేసింది. ఆయన అంత్యక్రియలను మావోయిస్ట్ లాంఛనాలతో  పూర్తి చేసినట్లు ఆ ఫోటోలను బట్టి చెప్పవచ్చు. ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి.. ఎర్రజెండా కప్పిన మావోలు, అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ మావోయిస్టు శ్రేణులు, ప్రజలు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. 

 

maoist leader rk funeral photos goes viral

 

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ Rama Krishna మరణించినట్టుగా మావోయిస్టు పార్టీ నిన్న అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 14వ తేదీన ఆర్‌కె మరణించినట్టుగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు. ఆర్కేకు కిడ్నీలు ఫెయిల్ కావడంతో మరణించినట్టుగా అభయ్ తెలిపారు. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి శుక్రవారం నాడు మీడియాకు ప్రకటనను విడుదల చేశారు. Maoist పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కేకు అంత్యక్రియలను నిర్వహించినట్టుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి Abhay ప్రకటించారు.

ALso Read:బీజాపూర్ : మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

కిడ్నీలు పాడు కావడంతో ఆర్‌కెకు చికిత్స కూడా అందించామని ఆ ప్రకటనలో అభయ్ వివరించారు. అయితే  ఆర్‌కెను కాపాడుకోలేకపోయామన్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం ఆరు గంటల సమయంలో ఆర్‌కె మరణించినట్టుగా ఆ లేఖలో మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

 

maoist leader rk funeral photos goes viral

 

1958 గుంటూరు (guntur) జిల్లా పల్నాడు (palnadu) ప్రాంతంలో రామకృష్ణ జన్మించారు. మాచర్లలో డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికట్ స్టూడెంట్స్ యూనియన్ కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నాడు.1980లో తొలిసారిగా ఆయన పీపుల్స్ వార్ (peoples war group) కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 1982లో పీపుల్స్‌వార్ లో హోల్ టైమర్ గా చేరాడు. దీంతో ఆర్‌కె  అడవుల్లోకి వెళ్లిపోయారు. నల్లమల అటవీ ప్రాంతంలో పార్టీ విస్తరణకు పనిచేశారు. ఆ తర్వాత ఆయన గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 1996 నుండి 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేశారు.

 

maoist leader rk funeral photos goes viral

 

 2008 నుండి 2016 వరకు ఏవోబీ కార్యదర్శిగా పనిచేశారు.  ఆ తర్వాత ఆయన  కేంద్రకమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. మావోయిస్టు కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో మరణించారు. దీంతో ఉన్న కొద్ది మంది నేతల రక్షణ కోసం పార్టీ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని అడవుల్లోకి రావాలని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios