బీజాపూర్ : మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత
మావోయిస్ట్ పార్టీ (maosit party) అగ్రనేత రామకృష్ణ (rama krishna) (ఆర్కే) (rk) మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ (bijapur forest) అడవుల్లో ఆయన మరణించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
మావోయిస్ట్ పార్టీ (maosit party) అగ్రనేత రామకృష్ణ (rama krishna) (ఆర్కే) (rk) మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బీజాపూర్ (bijapur forest) అడవుల్లో ఆయన మరణించినట్లుగా పలు తెలుగు టీవీ ఛానెల్స్ కథనాలను ప్రసారం చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే తర్వాత కోలుకున్నారంటూ ప్రచారం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో (united andhra pradesh) వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajasekhara reddy) సీఎంగా వున్నప్పుడు ప్రభుత్వంతో చర్చల సమయంలో ఆర్కే కీలకంగా వ్యవహరించారు. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద ఎన్‌కౌంటర్‌ల నుంచి ఆర్కే తృటిలో తప్పించుకునేవారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతి సందర్భంలో కూడా ఆర్కే చనిపోయారు.. లేదంటే బ్రతికే వున్నారంటూ ప్రచారం జరిగేది. కానీ ఎక్కడో ఒకచోటు ఆర్కే సంచారంపై వార్తలు వచ్చేవి. అయితే ఆయన రెండు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
2003లో తిరుమల శ్రీవారి బ్రహ్మోహత్సవాల్లో (srivari brahmotsavam) పాల్గొనేందుకు వెళ్తున్న అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై (nara chandrababu naidu) అలిపిరి వద్ద (alipiri attack on cbn) జరిగిన క్లెమోర్‌మైన్ దాడి వెనుక కీలక సూత్రధారి ఆర్కే అని పోలీసులు చెబుతున్నారు. దీనితో పాటు దేశవ్యాప్తంగా అనేక దాడుల్లో రామకృష్ణ కీలకపాత్ర పోషించారు. ఆయన తలపై దాదాపు రూ.50 లక్షలకు పైగా రివార్డు వుంది.
ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ (akkiraju haragopal). నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితుడైన ఆయన ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్కేగా పేరు మార్చుకున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ (maoist central committee ) సభ్యుడిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు గత కొంతకాలంగా బస్తర్ (bastar forest) అటవీ ప్రాంతంలో ఆర్కే తలదాచకున్నట్లుగా తెలుస్తోంది.
ఆర్కే మరణించినట్లుగా బస్తర్ పోలీసులు ధ్రువీకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని తుమ్రుకోటకు చెందినవారు. ఛత్తీస్ గడ్ లరాష్ట్రంలోని సుకుమా - బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో గల ఓ గ్రామంలో ఆయన మరణించినట్లు చెబుతున్నారు. ఆయన కుమారుడు పోలీసు ఎన్ కౌంటర్ లో గతంలో మరణించాడు. అనారోగ్యంతో ఆయన ఆయన మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనపై 85 కేసులున్నాయి
నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్ కౌంటర్ లో ఆయన గాయపడినట్లు, బుల్లెట్ గాయాలు తగిలినట్లు చెబుతున్నారు.. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో బాధుపడుతున్నట్లు చెబుతున్నారు. ఏపీ - ఒడిశా ఇంచార్జీగా ఆయన పనిచేస్తున్నారు. తమకు సమాచారం లేదని విరసం నేత కల్యాణ్ రావు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆర్కె అలియాస్ రామకృష్ణ అలియాస్ అక్కిరాజు హరగోపాల్ ప్రకాశం జిల్లాకు చెందిన పద్మజను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఉద్యమంలో పనిచేశారు. అయితే, ఆమె బయటకు వచ్చి టీచర్ గా పనిచేశారు. ఆమెపై కూడా కేసులు ఉన్నాయి. ఆర్కే తండ్రి టీచర్ గా పనిచేశారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.