ఉగ్రవాద నిధుల కేసులో అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం, ఛోటా షకీల్, ఆరిఫ్ అబూబకర్ షేక్, షబ్బీర్ అబూబకర్ షేక్, మహ్మద్ సలీం ఖురేషీలపై జాతీయ దర్యాప్తు సంస్థ చార్జిషీట్ నమోదు చేసింది. దావూద్ ఇబ్రహీం 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి సహచరుడు ఛోటా షకీల్, ‘డి కంపెనీ’కి చెందిన మరో ముగ్గురు సభ్యులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. గ్లోబల్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్, ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ సిండికేట్ నడుపుతున్నందుకు ఈ చర్యకు ఉపక్రమించింది.
సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్.. డాక్టర్ అనహిత పండోల్‌పై ఎఫ్ఐఆర్
చార్జిషీట్‌లోని ఇతర నిందితుల్లో ఆరిఫ్ అబూబకర్ షేక్, షబ్బీర్ అబూబకర్ షేక్, మహ్మద్ సలీం ఖురేషీ పేర్లు కూడా ఉన్నాయి. “డి-కంపెనీ, ఉగ్రవాద ముఠా, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్‌లో సభ్యులుగా ఉన్న నిందితులు వివిధ రకాల చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహిస్తూ.. ముఠా నేర కార్యకలాపాలను మరింత పెంచడానికి కుట్ర పన్నారని దర్యాప్తులో తేలింది. కుట్ర చేసి, బెదిరింపులకు గురి చేసి, వ్యక్తులను తీవ్రంగా గాయపరిచి ఓ ఉగ్రవాది తక్షణ ప్రయోజనం కోసం భారీ మొత్తంలో డబ్బు సేకరించారు. భారతదేశ భద్రతను బెదిరిస్తూ, సాధారణ ప్రజల మనస్సులలో భీభత్సం సృష్టిస్తూ దోపిడి చేశారు ’’ అని ఎన్ఐఏ పేర్కొంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్ 2 సాంగ్స్.. కాపీరైట్ కేసు వేసిన మ్యూజిక్ సంస్థ
“అరెస్టయిన నిందితులు ముంబై, ఇతర ప్రాంతాలలో సంచలనాత్మక ఉగ్రవాద లేదా నేరపూరిత చర్యలను ప్రేరేపించడానికి విదేశాలలో పరారీలో ఉన్న, వాంటెడ్ నిందితుల నుండి హవాలా మార్గాల ద్వారా భారీ మొత్తంలో డబ్బు అందుకున్నట్లు కూడా నిర్ధారణ అయ్యింది.’’ అని ఎన్ఐఏ తెలిపింది.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్లు 17, 18, 20, 21, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ 1999లోని సెక్షన్ 3(1) (2), 3(4), 3(5) కింద, అలాగే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 387, 201, 120బీ కింద ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఎన్ఐఏ ముంబై బ్రాంచ్ కేసు నమోదు చేసింది.
నేను దొంగనైతే.. నువ్వు గజదొంగవు.. : కేజ్రీవాల్ పై ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు
కాగా.. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉన్న దావూద్ ఇబ్రహీం 1993 ముంబై వరుస పేలుళ్లు, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి భారతదేశంలో వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో దావూద్ ఇబ్రహీంపై యాంటీ టెర్రర్ ఏజెన్సీ రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.
